రైల్వే ఉద్యోగులకు పండుగ సమయంలో శుభవార్త చెప్పనుంది కేంద్ర సర్కార్… ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ సమావేశం కానున్న కేంద్ర కేబినెట్.. దసరా, దీపావళి ముందు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రచారం సాగుతోంది.. ముఖ్యంగా పలు రంగాల కార్మికులకు ప్రయోజం కలిగేలా నిర్ణయం తీసుకుని.. ఇవాళే ప్రకటన చేయనున్నారు.. అందులో భాగంగా దేశవ్యాప్తంగా రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది కేంద్రం.. ప్రొడక్టివిటీ లింక్‌డ్ బోనస్‌ను (పీఎల్‌బీ) ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.. కేంద్ర మంత్రివర్గం 2021-22…
APCPDCL: ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ (ఏపీసీపీడీసీఎల్) ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కార్యాలయాల్లో మొబైల్ ఫోన్‌లు వాడొద్దంటూ ఉద్యోగులందరికీ మెమో జారీ చేసింది. అక్టోబరు 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. డిస్కంల ఉద్యోగులు పని వేళ్లలో సమయాన్ని వృథా చేస్తున్నారని, రోజువారీ పనిని వాయిదా వేస్తున్నారని ఈ నెల 19న విడుదల చేసిన మెమోలో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మాజనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. పనిని వాయిదా వేయడం వల్ల పేరుకుపోతోందని అభిప్రాయపడ్డారు. పని…
Infosys: ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఇన్ఫోసిస్ ఒకటి. అయితే ఇటీవల కరోనా కారణంగా పలు ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడంతో చాలా మంది ఉద్యోగులు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్నట్లు బహిర్గతమైంది. దీంతో పలు కంపెనీలు చర్యలు చేపట్టాయి. ఇన్ఫోసిస్ కూడా రంగంలోకి దిగింది. కొద్దిరోజుల కిందట తమ ఉద్యోగులందరికీ మెయిల్స్ పంపించింది. ఎవరైనా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కంపెనీ నియమాలను ఉల్లంఘించిన వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని…
Botsa Satyanarayana: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఉద్యోగులను రెచ్చగొడుతోంది చంద్రబాబేనని ఆరోపించారు. ఇటువంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం మన ఖర్మ అన్నారు. గత 60 ఏళ్ళుగా గురువులను పూజించుకోవటం ఆనవాయితీగా వస్తోందని.. ప్రతి ఒక్కరూ తమ చిన్నప్పటి గురువులను స్మరించుకుంటూ ఉంటారని.. ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులను ముఖ్యమంత్రి జగన్ ఈరోజు సత్కరించారని తెలిపారు. ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని.. ఆయన…
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధం అవుతోంది.. మరో రెండు మూడు వారాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రమోషన్లను ప్రకటించే అవకాశం ఉంది.. ప్రమోషన్‌కు సంబంధించిన న్యాయపరమైన సమస్యలను పరిష్కరించడంపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం.. మొత్తంగా, పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నెల 1వ తేదీన 8 వేల మందికి పైగా కేంద్ర అధికారులకు పదోన్నతి కల్పించిన ప్రభుత్వం, ఇప్పుడు మరోసారి పలువురు అధికారులకు పదోన్నతి కల్పించేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర…
Co-working: కరోనా మహమ్మారి నేపథ్యంలో కో-వర్కింగ్ కల్చర్ ఇక కనుమరుగైనట్లే అని అందరూ అనుకున్నారు. కానీ ఆ అంచనా తప్పు అని రుజువైంది. కలిసి పనిచేద్దాం రా అంటూ ఉద్యోగులు కో-వర్కింగ్కి జై కొడుతున్నారు. ఏక్ నిరంజన్లా ఒంటరిగా కూర్చొని చేసే వర్క్ ఫ్రం హోంతో తెగ బోర్ కొట్టి క్రమంగా కార్యాలయాల బాట పడుతున్నారు.