Employees Shock To Twitter : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ సంస్థలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మస్క్ ట్విట్టర్ కు బాస్ అయిన వెంటనే సగానికి పైగా ఉద్యోగులను ఇంటికి సాగనంపిన సంగతి తెలిసిందే. వీరిలో సీఈవో పరాగ్ అగర్వాల్ సహా ఎందరో టాప్ లెవెల్ ఉద్యోగులు కూడా ఉన్నారు. దీంతో, ట్విట్టర్ ఉద్యోగుల్లో అభద్రతా భావం నెలకొంది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం పోతుందో తెలియని పరిస్థితిలో ట్విట్టర్ ఎంప్లాయీస్ ఉన్నారు.
Read Also: CM Jagan Narsapuram Tour Live Updates: సీఎం జగన్ నర్సాపురం పర్యటన.. లైవ్ అప్ డేట్స్
ఇదిలా ఉంటే మరోవైపు ఉద్యోగులంతా కష్టించి పనిచెయ్యాలని, రోజుకు 12 గంటల చొప్పున వారానికి 80 గంటలు పనిగంటల నిబంధన ఆ సంస్థ యజమాని మస్క్ తీసుకురావడం… ట్విట్టర్ ఉద్యోగుల్లో అసహనాన్ని మరింత పెంచింది. మస్క్ చర్యను వ్యతిరేకిస్తూ ఏకంగా 1,200 మంది ఉద్యోగులు ట్విట్టర్ కు రాజీనామా చేశారు. వీరిలో ఎక్కువ మంది టెక్ విభాగానికి చెందిన వారేనని సమాచారం. దీంతో మస్క్ దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన ఉద్యోగులకు ఈ మెయిల్స్ పంపారు. వెంటనే శాన్ ఫ్రాన్సిస్కోలోని మెయిన్ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని కోరారు.