Union Cabinet: రైల్వే ఉద్యోగులకు శుభవార్త..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైల్వే ఉద్యోగులకు పండుగ సమయంలో శుభవార్త చెప్పనుంది కేంద్ర సర్కార్… ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ సమావేశం కానున్న కేంద్ర కేబినెట్.. దసరా, దీపావళి ముందు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రచారం సాగుతోంది.. ముఖ్యంగా పలు రంగాల కార్మికులకు ప్రయోజం కలిగేలా నిర్ణయం తీసుకుని.. ఇవాళే ప్రకటన చేయనున్నారు.. అందులో భాగంగా దేశవ్యాప్తంగా రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది కేంద్రం.. ప్రొడక్టివిటీ లింక్‌డ్ బోనస్‌ను (పీఎల్‌బీ) ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.. కేంద్ర మంత్రివర్గం 2021-22 కోసం రైల్వే ఉద్యోగులకు ప్రొడక్షన్-లింక్డ్ బోనస్ (పీఎల్‌బీ)ని క్లియర్ చేసే అవకాశం ఉంది. ప్రతిపాదన ప్రకారం, 11 లక్షల మంది నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులు బోనస్‌ను పొందనున్నారు.
Read Also: Gold and Silver Price: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. ఎంతంటే..?
Also Read
- Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
- Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
దీని వల్ల భారతీయ రైల్వేపై రూ.2,000 కోట్ల అదనపు భారం పడనుంది అని లెక్కలు వేస్తున్నారు.. 2021లో, అర్హత కలిగిన నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన ఉత్పాదకత-అనుసంధాన బోనస్‌ను 1.156 మిలియన్ల నాన్-గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు లబ్ది చేకూర్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.. గతంలో బోనస్‌పై దాదాపు రూ.1,985 కోట్ల వ్యయం జరిగింది. కాగా, సాధారణంగా దసరా మరియు నవరాత్రి పూజా ఉత్సవాల ముందు బోనస్ ప్రకటిస్తారు.. అయితే.. రైల్వే నాన్ గెజిటెడ్ ఉద్యోగుల్లో మళ్లీ ఆర్‌పీఎఫ్, ఆర్‌పీఎస్‌ఎఫ్ సిబ్బందిని మినహాయించి ఈ బోనస్‌ను ప్రకటించనుంది కేంద్రం. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 11.56 లక్షల మంది నాన్- గెజిటెడ్ ఉద్యోగులకు కేంద్రం తీసుకోబోయే నిర్ణయంతో ప్రయోజనం కలగబోతోంది..
ఇక, పీఎల్‌బీ పరిధిలోకి తీసుకొచ్చిన మొదటి ప్రభుత్వ విభాగం భారతీయ రైల్వేనే కావడం మరో విశేషంగా చెప్పుకోవాలి.. తొలిసారిగా 1979-80లో పీఎల్‌బీని ప్రవేశపెట్టింది. దీనికోసం రైల్వేలో ఆల్ఇండియన్ రైల్వేమెన్ ఫెడరేషన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేమెన్ అనే రెండు ఫెడరేషన్స్‌ను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా.. బోనస్ ఇస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. భారత ఆర్థిక వ్యవస్థలో రైల్వే కూడా ఎప్పటినుంచో కీలకంగా ఉన్న విషయం విదితమే.. మొత్తం ఆర్థిక వ్యవస్థ పనితీరులో మౌలిక సదుపాయాల మద్దతుగా రైల్వే చాలా కీలకంగా ఉంది..
తాజావార్తలు
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!