PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని అమెరికా చేరారు. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత తొలిసారి మోడీ అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనపై ఇరు దేశాలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి. సుంకాలు, అక్రమ వలసదారులు, ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పలు అంశాలు ఇరు దేశాధినేతల చర్చల్లో ముఖ్యాంశాలుగా ఉండబోతున్నాయి.
Read Also: Prudhvi Raj: అందరికీ క్షమాపణలు.. బాయ్ కాట్ కాదు వెల్కమ్ లైలా అనండి!
ఇదిలా ఉంటే, ప్రధాని మోడీ రోజు వైట్‌హౌజ్‌లో బిలియనీర్, వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌తో సమావేశం కానున్నారు. ట్రంప్‌తో భేటీకి ముందే మోడీ, టెస్లా అధినేతతో సమావేశం కానున్నారు. ప్రధాని మోడీ బుధవారం రాత్రి వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు. 2015లో ప్రధాని మోడీ శాన్ జోస్‌లోని టెస్లా ఫెసిలిటీని సందర్శించారు. ప్రస్తుతం మస్క్ ట్రంప్‌కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.
గతంలో మస్క్ భారత్‌లోకి టెస్లా కార్లను తీసుకురావాలని చూశాడు. ఈ భేటీలో దీనిపై చర్చించే అవకాశం ఉంది. మరోవైపు భారత్‌లో స్టార్‌లింక్ విస్తరణ, టెస్లా ప్లాంట్ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ఆప్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(DOGE)కి ఎలాన్ మస్క్ చీఫ్‌గా ఉన్నారు.