ప్రీమియం సబ్స్క్రిప్షన్ కింద అమెరికా సహా ఎంపిక చేసిన పలు దేశాల్లో నెలవారీ రుసుంతో బ్లూటిక్ ఇస్తున్న ట్విట్టర్ భారత్‌లోనూ ప్రారంభించింది. ట్విట్టర్ వెబ్‌సైట్‌ని ఉపయోగిస్తున్న వారు బ్లూటిక్ కావాలంటే దాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
Twitter: ట్విట్టర్ టేకోవర్ చేసిన తర్వాత ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఉద్యోగులను తొలగిస్తూ షాక్ ఇచ్చిన ఆయన ఆ తరువాత వెరిఫైడ్ ఖాతాలకు నెలకు ఇంత సభ్యతం చెల్లించాలని కొత్త రూల్ తీసుకువచ్చారు. ట్విట్టర్ బ్లూ టిక్ ఆప్షన్ తీసుకువచ్చారు.
మైక్రో బ్లాగ్గింగ్ సైట్ ట్విట్టర్లో మరోసారి ఉద్యోగాల కోత ఉండబోతున్న వార్తలతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక భారీగా ఉద్యోగుల్ని తొలగించగా..మరోసారి అదే బాటలో వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
Today (18-01-23) Business Headlines: హైదరాబాదులో పెప్సికో విస్తరణ: అమెరికన్ మల్టీ నేషనల్ ఫుడ్ కంపెనీ పెప్సికో హైదరాబాదులో కార్యకలాపాలను విస్తరించనుంది. ఏడాదిన్నర లోపు 12 వందల మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. 2019లో 250 మందితో ప్రారంభమైన పెప్సికో గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ సెంటర్ ఇప్పుడు 2 వేల 800 మందితో నడుస్తోంది. విస్తరణతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 4 వేలకు చేరనుంది.
Elon Musk: ఎలాన్ మస్క్ ఆధీనంలో ఉన్న టెస్లా కంపెనీ తన ఈవీ(ఎలక్ట్రిక్ వెహికల్) ధరలను భారీగా తగ్గించేసింది. ఇటీవల టెస్లా షేరు దారుణంగా పడిపోయింది. దీంతో సంస్థను నష్టాల భారి నుంచి తప్పించుకునేందుకు టెస్లా యజమాని మస్క్ దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు.
Elon Musk: అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఎలోన్ మస్క్. ప్రపంచ కుబేరుడిగా ఆయనకు పేరు.అతను స్పేస్ ఎక్స్(Space X), టెస్లా(Tesla) కంపెనీలకు CEO. గతేడాది ఏప్రిల్‌లో రూ.3.5 లక్షల కోట్లతో ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. అతను ట్విట్టర్ కొనుగోలు సమయంలో తన టెస్లా కంపెనీలో వాటాలను విక్రయించడం ప్రారంభించాడు.
Elon Musk: ఎలాన్ మస్క్‌కు చెందిన రాకెట్ తయారీ సంస్థ మరియు శాటిలైట్ ఇంటర్నెట్ కంపెనీ స్పేస్ఎక్స్ మరోసారి నిధుల సమీకరణ కోసం తెర తీస్తోంది. నూతన సంవత్సరంలో కొత్త ఫండింగ్ రౌండ్లో 750 మిలియన్ డాలర్ల ఫండ్ రైజ్ చేయనుంది. దీంతో స్పేస్ఎక్స్ మార్కెట్ వ్యాల్యూ 137 బిలియన్ డాలర్లకు చేరుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ సంస్థ 2022లో 2 బిలియన్ డాలర్లకు పైగా నిధులను పోగేసిన సంగతి తెలిసిందే.