Elon Musk: ప్రపంచ కుబేరునిగా పేరొందిన ‘టెస్లా’ కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ జీవితం ఎంతోమంది యువకులకు ఆదర్శంగా నిలచింది. అతని గెలుపు బాటను స్ఫూర్తిగా తీసుకుంటున్న వారెందరో ఉన్నారు. అయితే ఈ మధ్యనే ఆయన ట్విట్టర్ ను కొనుగోలు చేసి వేలమంది ఉద్యోగస్థులను వీధిన పడేలా చేసినందుకూ మస్క్ ను అసహ్యించుకొనేవారూ లేకపోలేదు. ఏది ఏమైనా విజేతగా నిలచిన వారి జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమే కదా! దీనిని దృష్టిలో ఉంచుకొనే ఆస్కార్ అవార్డ్ విజేత అలెక్స్ గిబ్నీ, ఎలాన్ మస్క్ జీవితంపై ఓ డాక్యుమెంటరీని రూపొందించబోతున్నారట.
Deepika Padukone: అయ్యో.. దీపికా పదుకొణే.. ఫ్యాన్స్ ఆవేదన!
గతంలో అలెక్స్ గిబ్నీ తెరకెక్కించిన డాక్యుమెంటరీలు ఎంతో ఆదరణ పొందాయి. వాటిలో “టాక్సీ టు ద డార్క్ సైడ్” ఆయనకు ఆస్కార్ అవార్డును సొంతం చేసింది. “ఎన్రాన్:ద స్మార్టెస్ట్ గైస్ ఇన్ ద రూమ్”, “గోయింగ్ క్లియర్: సైంటాలజీ అండ్ ద ప్రిజన్ ఆఫ్ బిలీఫ్”, “స్టీవ్ జాబ్స్: మ్యాన్ ఇన్ ద మెషీన్” వంటి చిత్రాలు వీక్షకులను ఎంతగానో అలరించాయి. డాక్యుమెంటరీస్ తీయడంలోనే కాదు, వాటిలో డ్రామాను మిళితం చేసి రంజింప చేయడంలోనూ అలెక్స్ సిద్ధహస్తుడు. అందువల్లే టెస్లా అధినేత మస్క్ డాక్యుమెంటరీ అలెక్స్ చేతిలో వాలిందని జనం అంటున్నారు. ఇది ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో కానీ, ఎలాన్ మస్క్ ను అభిమానించేవారికి ఆ డాక్యుమెంటరీ ఓ అధ్యయన అంశం కానుందని అంటున్నారు. మరి అందులో ఎలాన్ మస్క్ ఎదుర్కొన్న వివాదాలు కూడా చోటు చేసుకుంటాయా? ఇది మస్క్ ను వ్యతిరేకించే వారి ప్రశ్న! ఆస్కార్ అవార్డు విన్నర్ అలెక్స్ తెరపై ఎలాన్ ను ఎలా ఆవిష్కరిస్తారో చూద్దాం.