New CEO of Twitter: ట్విట్టర్‌కు కొత్త సీఈవోగా పెంపుడు కుక్క..! ఎలాన్ మస్క్‌పై నెటిజన్ల ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New CEO of Twitter: టెస్లా అధినేత, ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్లు ఓవైపు హాస్యం పంచుతున్నా.. మరో వైపు తీవ్ర వివాదానికి దారి తీశాయి.. ముఖ్యంగా భారతీయులు తీవ్రస్థాయిలో ట్విట్టర్ చీఫ్‌పై ఫైర్ అవుతున్నారు.. నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ వివాదాస్పద పోస్టులతో చెలరేగిపోయే టెస్లా చీఫ్.. ఇప్పుడు చేసిన ట్వీట్ భారతీయుల మనోభావాలను దెబ్బతీశాడు. ట్విట్టర్ మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్‌ను కుక్క కన్నా హీనం అని అర్థం వచ్చేలా ట్విట్టర్ సీఈవో కుర్చీపై ఓ కుక్కను కూర్చోబెట్టి దాని మెడలో సీఈవో అని తగిలించి.. ఆ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.. అయితే, ట్విట్టర్ చీఫ్ చేసిన ఈ పోస్ట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఎలాన్ మస్క్ ఈ తిక్క పనులు ఏంటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.. ప్రపంచ కుబేరుడవు అయి ఉండవచ్చు. కానీ, అతనికి కనీస సంస్కారం లేదంటూ మండిపడుతున్నారు.. ట్విట్టర్ ఒప్పందం సందర్భంగా మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్‌తో ఎలాన్ మస్క్ కు అనేక వివాదాలు తలెత్తిన విషయం విదితమే కాగా.. ఒక దశలో పరాగ్ అగర్వాల్.. మస్క్ ట్విట్టర్ డీల్ విజయవంతం కాకుండా అడ్డుకునేందుకు యత్నించారనే ఆరోపణలు కూడా వచ్చాయి.. అయితే, మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన వెంటనే, అప్పటి వరకు సీఈవోగా ఉన్న పరాగ్ అగర్వాల్‌ను తొలగించాడు.. అప్పట్లో దీనిపై పెద్ద దుమారమే రేగింది.. అయితే, మరోసారి దానిని గెలికే ప్రయత్నం చేశారు మస్క్.. తన పెంపుడు కుక్క ఫ్లోకి ఇప్పుడు మైక్రోబ్లాగింగ్ సైట్ యొక్క కొత్త సీఈవో అని ప్రకటించారు. Floki మునుపటి సీఈవో కంటే మెరుగైనది అంటూ ఆయన జోడించిన వికృత వ్యాఖ్య.. ఇప్పుడు చాలా మంది నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తోంది..
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
ఫిబ్రవరి 15న తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాకు వెళ్లినప్పుడు మస్క్ ట్విట్టర్‌లో తుఫాను సృష్టించాడు. షిబా ఇను, జపాన్‌కు చెందిన వేట కుక్కల జాతి.. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ యొక్క సీఈవో అంటూ పోస్ట్ చేశారు.. తన డెస్క్ వద్ద ఫ్లోకీ యొక్క చిత్రాన్ని పోస్ట్ చేశారు.. ఇది ట్విట్టర్ లోగోతో కూడిన కాగితం ముక్క, సంతకానికి బ్లాక్ స్పాట్, ఫ్లోకి పేరు మరియు “చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్” అనే టైటిల్‌ను చూపుతుంది. పరాగ్ అగర్వాల్ పేరును సూచించే “ఇతర వ్యక్తి” కంటే తన కుక్క Floki మెరుగైన సీఈవోగా చేస్తుందని కామెంట్ పెట్టడమే తాజా వివాదానికి కారణం అవుతోంది.. ఇక, ట్విట్టర్ సీఈఓ ఫ్లోకీ అద్దాలు ధరించి ఉన్న మరొక చిత్రాన్ని తీసి, “అతను సంఖ్యలతో గొప్పవాడు!” అని రాస్తూ మస్క్ నుండి హాస్యభరితమైన పోస్టింగ్ కొనసాగింది.
The new CEO of Twitter is amazing pic.twitter.com/yBqWFUDIQH
— Elon Musk (@elonmusk) February 15, 2023
He’s great with numbers! pic.twitter.com/auv5M1stUS
— Elon Musk (@elonmusk) February 15, 2023
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!