ఓటింగ్‌లో వినియోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)ని హ్యాక్ చేశాడని ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సయ్యద్ షుజా అనే వ్యక్తి ఈవీఎంల ఫ్రీక్వెన్సీని ట్యాంపరింగ్ చేయడం ద్వారా హ్యాక్ చేయవచ్చని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది. అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
ఎన్నికల్లో ఈవీఎంల వినియోగాన్ని నిలిపివేయాలని, రాబోయే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌లను ఉపయోగించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది.
దేశంలో సార్వత్రిక ఎన్నికలైనా, శాసనసభ ఎన్నికలైనా, ఉపఎన్నికలైనా సాధారణంగా ఈవీఎం యంత్రాలనే వాడతారు. ఓటరు తమ ఓటు హక్కును వినయోగించుకునేందుకు ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరమే ఈవీఎం. ఎవరైనా ఓటేయాలంటే దీనిని వినియోగించుకోవాల్సిందే. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను భారత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ సభ్యులు, రాష్ట్ర శాసన మండలి సభ్యులను ఎన్నుకోవడానికి ఎన్నికల్లో ఎందుకు వినియోగించడం లేదని ఎప్పుడైనా ఆలోచించారా?.