ఓటింగ్‌లో వినియోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)ని హ్యాక్ చేశాడని ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సయ్యద్ షుజా అనే వ్యక్తి ఈవీఎంల ఫ్రీక్వెన్సీని ట్యాంపరింగ్ చేయడం ద్వారా హ్యాక్ చేయవచ్చని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది. అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
READ MORE: CM Revanth Reddy: రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
మహారాష్ట్ర ఎన్నికల అనంతరం ఈవీఎంలను హ్యాక్ చేయడంతోపాటు ట్యాంపరింగ్ చేయగలనంటూ ఓ వ్యక్తి చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నికల సంఘం అతడిని సయ్యద్ షుజాగా గుర్తించింది. ఇతడిపై మహారాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబయి పోలీసులు నవంబర్ 30న కేసు నమోదు చేశారు.
READ MORE: Indigo: ఫంగల్ తుఫాన్ ఎఫెక్ట్.. తృటిలో తప్పిన విమాన ప్రమాదం.. గాల్లో వంపులు తిరిగిన ఫ్లైట్ (వీడియో)
సయ్యద్ షుజా ఈవీఎంలపై తప్పుడు వాదనలు చేస్తున్నాడని ఈసీ తెలిపింది. ఇతడిపై ముంబయి సైబర్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేసింది. 2019లోనూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇతడిపై దిల్లీలో కేసు నమోదైందని వివరించింది. ప్రస్తుతం ఇతడు విదేశాల్లో ఉన్నాడని ఈసీ వెల్లడించింది. ఈవీఎంను వైఫై లేదా బ్లూటూత్ వంటి వాటితో దీనిని అనుసంధానం చేయలేమని.. ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని మరోసారి స్పష్టం చేసింది.