Electoral bonds: ఎస్‌బీఐ అభ్యర్థనపై మార్చి 11న విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించేందుకు సమయం పొడిగించాలని కోరుతూ ఎస్‌బీఐ (SBI) వేసిన పిటిషన్‌పై మార్చి 11న సుప్రీంకోర్టు (Supreme court) విచారణ చేపట్టనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై సోమవారం విచారణ చేపట్టనుంది.
ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి 6లోపు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలంటూ గత నెలలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పాటించడంలో విఫలమైన ఎస్‌బీఐపై ఏడీఆర్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పైనా అదేరోజు వాదనలు విననుంది.
Also Read
- Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
దేశంలో ఎన్నికల బాండ్ల (Election Bonds)ను రద్దు చేయడంతో పాటు 2019 ఏప్రిల్ 12 నుంచి కొనుగోలు చేసిన బాండ్ల వివరాలను ఈనెల 6వ తేదీ లోపు ఎన్నికల సంఘానికి సమర్పించాలని SBIని ఆదేశిస్తూ ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది.
అలాగే మార్చి 13 నాటికి ఎన్నికల బాండ్లు ఇచ్చిన వారి వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచాలని ఈసీకి ఆదేశాలు జారీచేసింది. ఈనేపథ్యంలో బాండ్ల వివరాలను వెల్లడించేందుకు జూన్ 30 వరకు గడువు ఇవ్వాలంటూ ఈనెల 4న ఎస్‌బీఐ సుప్రీంకోర్టును అభ్యర్థించింది. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్).. ఎన్నికల బాండ్ల వివరాలు సమర్పించడంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అధికారులు పాటించలేదని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం సుప్రీంకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు దాతల వివరాలు, విరాళాల మొత్తాన్ని ప్రజలకు వెల్లడించకూడదనే ఉద్దేశంతోనే బ్యాంకు అధికారులు గడువు కోరుతున్నారని ఆరోపిస్తోంది.
తాజావార్తలు
-
Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!