Singareni Elections 2023 Polling Begins: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. 11 డివిజన్‌లలోని 84 పోలింగ్ కేంద్రాల్లో బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ సీక్రెట్ బ్యాలెట్ పద్దతిలో సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. సింగరేణి విస్తరించి ఉన్న మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కుమురం భీం ఆసిఫాబాద్, ఖమ్మం జిల్లాల్లో పోలింగ్ జరుగుతోంది. 13 కార్మిక సంఘాలు ఎన్నికల బరిలో ఉన్నాయి.
Also Read: IND vs SA: సెంచూరియన్ టెస్టులో పోరాడుతున్న కేఎల్ రాహుల్.. భారత్ స్కోర్ 208/8!
మొత్తం 39,775 మంది సింగరేణి కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 84 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల విధుల్లో 700 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే.. ఓట్ల లెక్కింపు కేంద్రాలకు బ్యాలెట్ పెట్టెలను తరలించనున్నారు. ఇక రాత్రి 7 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆరంభం అవుతుంది. లెక్కింపు పూర్తయిన తర్వాత ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్‌టీయూసీ, సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ (బీఆర్‌ఎస్ టీజీబీకేఎస్ సపోర్ట్) మధ్య జరుగుతున్నాయి.