మధ్యప్రదేశ్ లోని పాన్‌సెమల్ అసెంబ్లీ నియోజకవర్గ బూత్ నం.225లో శుక్రవారం పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ కేంద్రానికి నానాజీ భిల్జీ అహిరా అనే వ్యక్తి వచ్చి ఓటేశారు.
LB Nagar Politics: ఓటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. అధికార బీఆర్‌ఎస్ పార్టీ మరోసారి పట్టు సాధించాలని, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఈసారి విజయం సాధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
Tension is tension in Nizamabad: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బిగాలతో బీజేపీ అభ్యర్థి బహిరంగ చర్చకు అంగీకరించడంతో నిజామాబాద్‌లో ఉద్రిక్తత నెలకొంది. దీనికి అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ మంగళవారం ముగిసింది. అయితే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని బీజాపూర్‌లో అత్యల్ప పోలింగ్ అంటే కేవలం 40.98 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల పోలింగ్ ముగిసి కూడా దాదాపు 24 గంటలకు పైగా అవుతుంది. కాగా పోలింగ్ బృందం లోని 200 మందికి పైగా పోలింగ్ సిబ్బంది ఇప్పటి వరకు ఎన్నికల కంట్రోల్ రూమ్‌కు నివేదికను సమర్పించ లేదని ఎన్నికల కంట్రోల్ రూమ్ కి సంబంధించిన అధికారులు…
Manikrao Thakre: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పొత్తు పెట్టుకోనుందని తెలంగాణ ఇన్‌ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే అన్నారు. వామపక్షాలతో సంప్రదింపులు జరుగుతున్నాయని, అవి ఫలిస్తాయన్నారు.
భారత ఎన్నికల సంఘం గురువారం (అక్టోబర్ 26) నటుడు రాజ్‌కుమార్ రావుకు కీలక బాధ్యతను అప్పగించింది. తన నటనతో అందరినీ ఆకట్టుకున్న రాజ్‌కుమార్‌రావును కమిషన్ జాతీయ ఐకాన్‌గా నియమించింది. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తరఫున జాతీయ ప్రచారకర్తలుగా వ్యవహరించనున్న నేషనల్ ఐకాన్‌లలో ఒకరిగా ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ రావు నియమితులయ్యారు.
ఐపీఎల్ అంటే క్రికెట్ లవర్స్కు పండగే. ఏడాదికోసారి జరిగే ఈ మ్యాచ్ల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. అయితే కరోనా సమయంలో భారత్లో ఐపీఎల్ నిర్వహించలేదు. ఐపీఎల్ 2024 సీజన్ కూడా వేరే దేశాల్లో జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్కు ఇదొక చేదువార్తలా చెప్పవచ్చు. ఐపీఎల్ భారత్లో జరగకపోవడానికి గల కారణాలేంటంటే.. వచ్చే ఏడాదే భారత్లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. సరిగ్గా ఐపీఎల్ జరిగే సమయంలోనే ఎన్నికలు వస్తున్నాయి.
HCA Elections 2023 Results Out Today: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికలు మొదలయ్యాయి. ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో హెచ్‌సీఏ ఎన్నికలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు పోలింగ్ జరగనుంది. ఇక సాయంత్రం 6 గంటలలోపు ఫలితాలు వెలువడే అవకాశముంది. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వీఎస్ సంపత్ పర్యవేక్షణలో జరుగుతున్న హెచ్‌సీఏ ఎన్నికలకు అధికారులు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేశారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త…
Story Board: ఎన్నికల్లో పోటీకి దిగాలంటే కనీసం పాతిక కోట్లు ఉండాల్సిందే అనే పరిస్థితి వచ్చేసింది. డబ్బుంటేనే ఎన్నికలు.. నిధులున్నోడే అభ్యర్థి అనేది నేటి రాజకీయం. ఎన్నికలంటే సవాలక్ష ఖర్చులుంటాయి. ప్రచారం, సభలు, మద్యం, బిర్యానీ, కార్యకర్తల రోజువారీ ఖర్చు, ప్రచారానికి వచ్చే జనానికి బేటాలు.. ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే చాలా పోతాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి నేతల ఖర్చులు వీటికి అదనం. కులసంఘాలకూ తృణమో పణమో ముట్టజెప్పక తప్పదు. ఇక తిరగటానికి వాహనాలు, వాటికయ్యే…
BJP Meeting: బీజేపీ వివిధ రాష్ట్రాల్లో పార్టీ ఉనికిని బలోపేతం చేయడానికి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా నివాసంలో కోర్ గ్రూప్ సమావేశాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.