రెండు పర్యాయాలు రాష్ట్ర ప్రజల్ని కేసీఆర్ మోసం చేసి ఓట్లను కొల్లగొట్టారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. ఖమ్మం జిల్లా అనాసాగరం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. మేనిఫెస్టో పేరుతో మరోసారి భ్రమలు కల్పించేందుకు బీఆర్‌ఎస్ కుట్ర చేస్తోందన్నారు.
దేశవ్యాప్తంగా కులగణనకు ఇవాళ సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై మాట్లాడుతూ.. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని రాహుల్ వ్యాఖ్యానించారు.
ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్, రాజస్థాన్ ముఖ్యమంత్రులు చేస్తున్న ప్రకటనలపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ.. ఎన్నికల వరకూ చంద్రబాబు జైల్లో ఉండాలనేది జగన్ తాపత్రయం.. అందుకే హడావుడిగా రేపు జగన్ ఢిల్లీ వెళ్తున్నారు అని ఆయన ఆరోపించారు.
తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటిస్తుంది. సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం ఈరోజు నుంచి మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల బృందాన్ని సీపీఎం నేతలు కలిశారు. రాష్ట్రంలో గతంలో జరిగిన ఎన్నికల తీరుపై వారికి వివరించారు.
2024లో ఏకకాలంలో ఎన్నికలు జరగవని లా కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు 'ఒక దేశం, ఒకే ఎన్నికలు' విధానాన్ని అమలు చేయడం సాధ్యం కాదని లా ప్యానెల్ విశ్వసిస్తోందని వర్గాలు తెలిపాయి.
రాజకీయల్లో గత 40 ఏళ్లుగా అభివృద్ధి ద్యేయంగా పని చేశానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భవిష్యత్ లో కూడా అదే పని విధానము ఉంటుంది అని ఆయన తెలిపారు. ఒక నాయకుడు పార్టీలోకి వస్తుంటే కొందరు ఇబ్బంది పడతారు.. కానీ నన్ను క్రింది స్థాయి నుంచి అందరూ స్వాగతించారు.
ఒకే దేశం- ఒకే ఎన్నిక' అనే చర్చ దేశంలో జోరందుకుంది. శుక్రవారం అంటే సెప్టెంబర్ 1న, కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏ క్షణమైనా పార్లమెంటు ఎన్నికలు రావొచ్చని అన్నారు. దేశంలో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో నితీశ్ కుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.