నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరిగింది. నిర్ణీత సమయంలోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లను ఓటింగ్‌కు అధికారులు అనుమతిచ్చారు. ఉపఎన్నిక అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఈవీఎంలను ఆంధ్రా ఇంజనీరింగ్ కాలేజీలో స్ట్రాంగ్ రూమ్‌కు అధికారులు తరలించారు. ఈనెల 26న ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితం వెల్లడి కానుంది. అయితే సాయంత్రం 5 గంటల వరకు 61.70% పోలింగ్ జరిగింది. 6…
ఎన్నికల షెడ్యులు విడుదల కావడంతో ప్రజలు, పార్టీల దృష్టి కాబోయే రాష్ట్రపతి అభ్యర్థిపై పడింది. ఈ ఎన్నికల ద్వారా జాతీయస్థాయిలో రాజకీయ పరిణామాలు ఏలా మారతాయి? ఏ కూటమి నుంచి ఎవరు అభ్యర్ధిగా బరిలో దిగుతారో అనేదానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి తమ అభ్యర్ధి గెలుపు కోసం లెక్కలతో కుస్తీ పడుతోంది. పలు పార్టీలతో మంతనాలు జరుపుతున్నారు బీజేపీ ముఖ్యనేతలు. అయితే NDAకు వ్యతిరేకంగా రాష్ట్రపతి అభ్యర్ధిగా బరిలో ఎవరు ఉంటారు?…
తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు వస్తాయా ? ఏపీ, తెలంగాణలో అధికార పార్టీలు.. ఆ దిశగా ముందుకు వెళ్తున్నాయా ? విపక్ష నేతలు చేస్తున్న ప్రచారంలో నిజం ఎంత ? అసలు ఎందుకు ఈ రకమైన ప్రచారం జరుగుతోంది ? తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇటు తెలంగాణలోనూ రాజకీయ వాతావరణ వేడెక్కింది. అన్ని పార్టీలు తమ పాలిటిక్స్‌ను యాక్టివ్ మోడ్‌లోకి మార్చేశాయి. ముందస్తు ఎన్నికల ప్రచారాలతో ఈ వాతావరణం మరింత…
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా నామినేషన్ ఫార్మ్, అఫిడవిట్‌లో వ్యక్తిగత సమాచారాన్ని పొందుపర్చేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు. అంతేకాకుండా నామినేషన్లు దాఖలు చేయడానికి అపాయింట్‌మెంట్, ప్రచార కార్యక్రమాల నిర్వహణకు అనుమతులను పొందే అవకాశాన్ని భారత ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు www.suvidha.eci.gov.in పోర్టల్ ద్వారా…
ఒకవైపు ఒంగోలులో టీడీపీ మహానాడు.. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ మంత్రుల సామాజిక న్యాయభేరీ బస్సు యాత్రతో ఏపీలో ఎన్నికల వాతావరణం ప్రారంభం అయినట్టే కనిపిస్తోంది. మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు గర్జించారు. యుద్ధం ప్రకటించారు. వైసీపీని భూస్థాపితం చేస్తానని ప్రతిన బూనారు. జగన్ పాలనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఇదీ వైసీపీ అవినీతి, అక్రమాల, దౌర్జన్యాలు, దారుణాల చిట్టా అంటూ లెక్క చెప్పారు. జగన్ మింగిన అవినీతి సొమ్ము మొత్తం కక్కిస్తామని తెలుగు తమ్ముళ్ళ సాక్షిగా…
పొలిటికల్ డ్రామా మధ్య పాకిస్థాన్ ప్రధాని పదవి కోల్పోయారు ఇమ్రాన్ ఖాన్.. అయితే, అవిశ్వాత తీర్మానం తర్వాత అధికారాన్ని కోల్పోయిన ఇమ్రాన్.. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.. దీనిపై ఇస్లామాబాద్‌లో నిర్వహించిన ర్యాలీతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. ర్యాలీకి భారీ సంఖ‍్యలో తరలివచ్చారు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు.. ఈ సందర్భంగా పీటీఐ పార్టీ మద్దతుదారులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది.. ఆందోళనకారులను చెదరగట్టేందుకు పంజాబ్ ప్రావిన్స్‌లో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు, కొందరిని చెదరగొట్టారు.…
సూర్యాపేట జిల్లాలో కోదాడ పర్యటనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తెలంగాణలో కూడా పోటీ చేస్తుందని ప్రకటించారు. ఎన్ని స్థానాల్లో, ఎవరితో కలిసి పోటీ చేస్తామో త్వరలో వెల్లడిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో జనసేన నేతలు పర్యటిస్తారని.. తాను కూడా తెలంగాణలో తిరిగేందుకు సమయం కేటాయిస్తానని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానం తెలంగాణలోనే ప్రారంభించినట్లు ఆయన గుర్తుచేశారు. KCR: కేసీఆర్ ఆలిండియా టూర్…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 15 రాష్ట్రాల్లోని 57 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. జూన్ 10వ తేదీన పోలింగ్ జరగనుండగా.. అదే రోజు ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.. ఈనెల 24వ తేదీన రాజ్యసభ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల కానుండగా.. 24వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.. ఇక, జూన్ 1న నామినేషన్లు పరిశీలన, జూన్ 3న నామినేషన్ల విత్ డ్రాకు చివరి తేదీ కాగా..…
2024 ఎన్నికల కోసం అన్ని పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించాయి. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు 2024 ఎన్నికలపై త్వరలోనే కార్యాచరణ సిద్ధం చేస్తామని ప్రకటించారు. తాజాగా వైసీపీ అధినేత, సీఎం జగన్ కూడా ఈ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 27న తాడేపల్లిలో జగన్ కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు హాజరుకానున్నారు. కాగా మరోవైపు వచ్చే ఎన్నికల్లో వైసీపీతో…