పంజాబ్‌లో ఈనెల 20 వ తేదీన అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఫిబ్రవరి 14 న ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ, పంజాబ్ సిక్కుగురు జయంతి వేడుకలు ఉండటంతో ఎన్నికలను వాయిదా వేశారు. ఫిబ్రవరి 20 వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం అన్ని పార్టీలు తమదైన హామీలు ఇస్తూ మ్యానిఫెస్టోను రూపొందిస్తున్నాయి. తాజాగా బీజేపీ కూటమి మ్యానిఫెస్టోను విడుదల చేసింది. పంజాబ్ ఎన్నికల్లో బీజేపీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్, శిరోమణి అకాళిదళ్ పార్టీలు కలిసి కూటమిగా…
ఈనెల 10 వ తేదీన ఉత్తరప్రదేశ్‌లో తొలివిడత ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. కరోనా నిబంధనలను అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఉత్తరప్రదేశ్ తొలివిడత ఎన్నికల సందర్భంగా ఫిబ్రవరి 8 నుంచి 10 వ తేదీ సాయంత్రం వరకు ఎన్నికలు జరిగే నియోజక వర్గాల్లో మందుషాపులను బంద్ చేస్తున్నారు. ఢిల్లీకి అతి సమీపంలో ఉన్న నోయిడా, ఘజియాబాద్‌లలో లిక్కర్ షాపులు బంద్ అవుతున్నాయి. ఫిబ్రవరి 8 వ తేదీ…
యూపీ ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీల అభ్యర్ధులు నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్నారు. నేతల ఆస్తిపాస్తులు, అప్పుల వివరాలు బయటపడుతున్నాయి. యూపీ సీఎం యోగి తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. గోరఖ్‌పుర్ శాసనసభస్థానం నుంచి యోగి తన నామినేషన్ దాఖలుచేశారు. ఇప్పటివరకు లోక్‌సభకు ఐదుసార్లు ఎన్నికైన ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తొలిసారి అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. నామినేషన్ పత్రాలలో తన ఆస్తులు, తనపై ఉన్న కేసులకు సంబంధించిన వివరాలను అఫిడవిట్‌లో వెల్లడించారు.…
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 14 వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే, 2000 సంవత్సరం ముందు వరకు ఉత్తరప్రదేశ్‌లో కలిసి ఉన్న ఉత్తరాఖండ్‌ను 2000లో విభజించారు. కాగా, 2002లో తొలిసారి ఉత్తరాఖండ్‌కు ఎన్నికలు జరిగాయి. మొదటిసారి జరిగిన ఎన్నికల నుంచి 2017వ వరకు నాలుగుసార్లు ఎన్నికలు జరిగాయి. అయితే, ఉత్తరాఖండ్‌లోని పౌఢీ గఢ్వాల్ జిల్లాలోని యమకేశ్వర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు మహిళలే విజయం సాధిస్తూ వస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం…
ఫిబ్రవరి 10 నుంచి దేశంలోని 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే, కరోనా కేసులు, థర్డ్ వేవ్ దృష్ట్యా సభలు, సమావేశాలు, ర్యాలీలకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వలేదు. జనవరి 31 వరకు వీటిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కాగా, రేపు కేంద్ర ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాల్లోని కరోనా ఉధృతిపై సమీక్షను నిర్వహించబోతున్నది. అయితే, ఫిబ్రవరి 10 నుంచి ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో జనవరి 28 నుంచి, ఫిబ్రవరి 14 న ఎన్నికలు జరిగే…
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మణిపూర్లో మొత్తం 60 నియోజక వర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ ఒంటరిగానే పోటీ చేయాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే ఈ మేరకు ఇవాళ పార్టీ 60 అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్.. తన సిట్టింగ్ స్థానం హేంగాంగ్ నియోజకవర్గం నుంచే బరిలోకి దిగుతున్నారు. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ బీజేపీ అభ్యర్ధుల్ని ప్రకటించారు. మరోసారి మణిపూర్ లో మళ్లీ తామే…
ఒక వైపు కరోనా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రచార సభలు, రోడ్ షోలపై నిషేధం విధించింది. కేంద్ర ఎన్నికల సంఘం సమాలోచనలు నిర్వహించింది. ఐదు రాష్ట్రాలతో వరుస వీడియో కాన్ఫరెన్స్ లను నిర్వహిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయాలు వెలువరించింది. వివిధ పార్టీలు నిర్వహించే ఎన్నికల ప్రచార సభలలపై ఆంక్షలు అమలుచేస్తోంది. రోడ్ షోలపై నిషేధాన్ని కొనసాగించే అంశం పై నేడు నిర్ణయం తీసుకోనుంది కేంద్ర…
హుజురాబాద్ ఉపఎన్నిక రాష్ట్రంలో ఓ రేంజ్లో రాజకీయ వేడి రాజేసింది. అక్కడ ఫలితం వచ్చాక చర్చ అటువైపు వెళ్లలేదు. ఓటమిని లైట్ తీసుకున్నట్టుగా టీఆర్ఎస్ కనిపించింది. అయితే హుజురాబాద్ రాజకీయ క్షేత్రంలో కీలక నియోజకవర్గంగా మారిపోయింది. ఉపఎన్నికలో గుర్తించిన పొరపాట్లు రిపీట్ కాకుండా.. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే అక్కడ ఫోకస్ పెడుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం అధికార పార్టీలో ఇద్దరు నేతలు ఉన్నారు. ఒకరు ఉపఎన్నికలో ఓడిన గెల్లు శ్రీనివాస్ కాగా.. రెండో వ్యక్తి హుజురాబాద్…