రానున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. డిసెంబర్‌లోనే లోక్‌సభ ఎన్నికలు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని సోమవారం కోల్‌కతాలో అన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పోటీపై క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో పోటీచేస్తానని తెలిపారు. రాజకీయ అనుబంధాన్ని తెంచుకోవాలని ఉండెను.. కానీ మీ అభిమానం చూసిన తరువాత జిల్లా కోసం రాజకీయాల్లో ఉండాలని అనుకున్నానని తెలిపారు.
బీఆర్కే భవన్ లో సీఈఓ వికాస్ రాజ్ తో బీఆర్ఎస్ నేతలు సమావేశం అయ్యారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ లీగల్ సెల్ నేతలు సోమభరత్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, పలువురు అడ్వకేట్స్ ఫిర్యాదు చేశారు.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికల ప్రసంగానికి సంబంధించి నమోదైన కేసులో క్రిమినల్ ప్రొసీడింగ్‌లను కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది. ఆరోపణలపై అసంబద్ద కేసు నమోదు చేశారని కోర్టు పేర్కొంది.
వంశపారంపర్య రాజకీయాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. వారసత్వ రాజకీయాలు విషంతో సమానమని.. వాటి వల్ల ఒక కుటుంబం రాష్ట్రాన్ని శాసించడమే కాకుండా.. నిర్ణయాలు కూడా ఒక కుటుంబం నుంచి తీసుకోవడం జరుగుతుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
బీజేపీ ఎన్నికలకు అన్నిరకాలుగా సిద్దమవుతోంది అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే విధంగా ముందుకు వెళ్తున్నామని ఆమె తెలిపారు. 9 ఏళ్లుగా రాష్ట్రానికి పట్టిన పీడను ప్రారదొలెందుకు ప్రజలు రెఢీగా ఉన్నారు అంటూ విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వర్షాకాల పార్లమెంటు సమావేశాల అనంతరం వివిధ రాష్ట్రాల పర్యటనలు చేపడుతున్నారు. ఇప్పటికే రాజస్థాన్‌లో పర్యటను ముగించుకున్న రాహుల్ గాంధీ.. శుక్రవారం జమ్ము కాశ్మీర్ లడఖ్‌లో పర్యటించారు.
రెండు కమిటీల్లోనూ రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నేత వసుంధర రాజే పేరు లేదు. ఇదేంటని బీజేపీని ప్రశ్నించగా.. ప్రతి ఒక్కరికీ ఒక్కో పాత్ర ఇస్తున్నట్లు పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు.