Uddhav Thackeray: ఎన్నికల్లో సొంతంగా గెలుస్తామన్న నమ్మకం బీజేపీకి లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికలకు ముందు ప్రజల దృష్టిని మరల్చేందుకు బీజేపీ అనేక కుట్రలు చేస్తుందని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే ఆరోపించారు. అందుకోసమే.. ఇతర పార్టీల్లో చీలికలు సృష్టిస్తోంది.. యూనిఫాం సివిల్ కోడ్ వంటి అంశాలను తెరపైకి తీసుకువస్తుందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో సొంతంగా గెలుస్తామనే నమ్మకం లేనందునే అలా చేస్తోందని ఉద్ధవ్ థాక్రే విమర్శించారు. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉద్దవ్ థాక్రే బీజేపీతో సంబంధాలు తెంచుకుని ఎన్సీపీ, కాంగ్రెస్ లతో కలిసి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. థాక్రేతో షిండే తెగతెంపులు చేసుకోవడంతో గత ఏడాది జూన్ లో మమా వికాస్ అఘాడి కూటమి ప్రభుత్వం కూలిపోయింది.
Read Also: Vimanam: జీ 5లో దూసుకెళ్తోన్న ‘విమానం’.. ఏకంగా 50 మిలియన్ మినిట్స్!
Also Read
- Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
- India vs Afghanistan T20: వాషింగ్టన్, నితీష్ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి.. గంభీర్‌పై పరోక్ష విమర్శలు
- Liquor Prices: మద్యం బాటిళ్లపై అదనపు వసూళ్లు.. సీఎం సీరియస్.. 3 రోజుల్లో 240 మందిపై వేటు..
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ వల్లే నా భార్య దులీప్ ట్రోఫీ చూసింది’.. శ్రీకాంత్ కామెంట్స్ వైరల్
ఆ తర్వాత బీజేపీతో కలిసిన ఏక్ నాథ్ షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే నంబర్ వన్ ప్రధాని తమదని చెప్పుకుంటున్న బీజేపీ ఇతర పార్టీలను ఎందుకు చీల్చాల్సిన అవసరం ఉందని ఉద్దవ్ ఠాక్రే ప్రశ్నించారు. మీరు శివసేన పార్టీలో చీలికలు తెచ్చారు.. ఇప్పుడు ఎన్సీపీని కూడా చీల్చుతున్నారు.. రేపు మీరు ఇంకేదైనా పార్టీలో చీలికలు తీసుకురావొచ్చు అని ఆయన కామెంట్స్ చేశారు. దేశానికి చెందిన వాటిని అమ్మేసి ఇతరులకు దక్కాల్సిన వాటిని దోచుకుంటున్నారని ఉద్దవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అయిన బీజేపీ ముందు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అని క్యశ్చన్ చేశారు. బీజేపీ అధికార దాహంతోనే ఇలాంటి పని చేస్తుందని ఆయన ఆరోపించారు.
Read Also: Video Viral: కళ్లకు గంతలు కట్టుకున్న భలే కొట్టాడే.. వీడియో వైరల్..!
మహారాష్ట్రలో ఏమీ లేని బీజేపీని శివసేన తన భుజస్కంధాలపై మోసుకుని రాష్ట్రంలో పునాదిని విస్తరించేందుకు దోహదపడిందని ఉద్దవ్ థాక్రే తెలిపారు. ఇప్పుడు మమ్మల్నే రాజకీయాల్లో అంతమొందించాలని చూస్తున్నారు.. ఇది మీ హిందుత్వ పార్టీ అన్నారు. ఎన్నికలు ముగిశాక యూనిఫాం సివిల్ కోడ్ అంశాన్ని పక్కన పెట్టారని మాజీ సీఎం ఠాక్రే మండిపడ్డారు. అయోధ్య రామమందిర నిర్మాణం ద్వారా బీజేపీకి ఒరిగేదేమీ లేదు.. ఈ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన అన్నారు. రామ మందిర నిర్మాణం కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని తాము డిమాండ్ చేస్తున్నాం.. కానీ దానిని తీసుకువచ్చే దమ్ము ఈ బీజేపీ ప్రభుత్వానికి లేదని ఉద్ధవ్ థాక్రే అన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: “రెండేళ్లు సమయం ఇవ్వండి.. మీ సమస్యలు పరిష్కరిస్తా”.. ఉపాధ్యాయులకు సీఎం రేవంత్ రెడ్డి హామీ
-
Toxic English Version: యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. ఇంగ్లీష్ వెర్షన్‌కు సౌండ్ నిల్..
-
Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
-
Nepal Flash Floods: నేపాల్‌ను వెంటాడుతున్న ప్రకృతి విపత్తు.. దార్చులాలో విరిగిపడిన కొండచరియలు
-
India vs Afghanistan T20: వాషింగ్టన్, నితీష్ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి.. గంభీర్‌పై పరోక్ష విమర్శలు
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!