PM Modi: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు.. ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. అధికారంలో ఉన్న బీజేపీ 9 ఏళ్లల్లో దేశానికి ఏమీ చేయలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే.. వాళ్లవి స్వార్థ ప్రయోజనాలని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. 2024లో విజయం కోసం అధికార ఎన్‌డీఏ కూటమి.. విపక్షాల కూటమి వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ప్రతిపక్షాల కూటమి సమావేశంపై ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఫైర్ అయ్యారు. వారి విధానాలు అభివృద్ధి కోసం కాకుండా.. స్వార్ధ ప్రయోజనాల కోసమే ఉంటాయని మండిపడ్డారు.
Read also: Crocodiles : 6 ఎలిగేటర్లు, 6 మొసళ్లకు అమెరికా అర్డర్.. భారత్ ఏం చేయబోతోంది?
ప్రధాని నరేంద్ర మోడీ పోర్ట్ బ్లెయిర్‌లో వీరసావర్కర్ ఇంటర్నేషనల్ టెర్మినల్ బిల్డింగ్‌ను మంగళవారం వర్చువల్‌గా ఢిల్లీ నుంచే ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ విపక్షాలపై విరుచుకుపడ్డారు. కొన్ని పార్టీలు కుటుంబాల కోసమే పని చేశాయని.. ప్రతీకార రాజకీయాలకు పాల్పడ్డాయని విమర్శించారు. యూపీఏ హయాంలో జరిగిన తప్పులను తాము సరిదిద్దామన్నారు. అలా చేయడం వల్లే ఈ తొమ్మిదేళ్లలో దేశం గణనీయమైన అభివృద్ధి సాధించిందని తెలిపారు. సొంత లాభాల కోసమే విపక్షాలు పని చేస్తున్నాయన్న ప్రధాని మోడీ.. గతంలో వాళ్లు గిరిజనులను పట్టించుకోలేదని ఆరోపించారు. అభివృద్ధి అనే మాటెత్తకుండా.. స్వార్థ ప్రయోజనాలు చూసుకున్నాయంటూ విపక్షాల కూటమిపై మండిపడ్డారు.
Read also: Telangana: వరంగల్‌లో వీరంగం సృష్టించిన సైకో..ఇంట్లో చొరబడి రాళ్లతో దాడి..
ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే అని ఉంటుంది.. కానీ కుటుంబ రాజకీయాలను ప్రొత్సహించే పార్టీల్లో.. కుటుంబాల కోసం.. కుటుంబాల చేత, కుటంబాల కొరకే అని ఉంటుందన్నారు. దేశం కోసం వాళ్లేం చెయ్యలేరని.. విద్వేషం, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు మాత్రమే ఉంటాయన్నారు. కేవలం వాళ్ల కుటుంబాలే ఎదగాలనుకుంటున్నాయి తప్ప.. పేదల గురించి ఎలాంటి ఆలోచనలు చెయ్యరటూ విపక్షాలపై మండిపడ్డారు. దేశ ప్రజలు 2024లో తిరిగి తమనే అధికారంలోకి తేవాలని నిర్ణయించుకున్నారని .. అందుకే వారు బెంగళూరు చేరి తమ దుకాణాలు తెరచుకున్నారని ఎద్దేవా చేశారు. 24 కే లియే 26 హోనే వాలే రాజనైతిక్ దలోన్ పర్ యే బడా ఫిట్ బైత్ తా హై .. అంటూ పాటలు పాడుతున్నారని.. కానీ వాస్తవం మరోలా ఉందని ప్రధాని మోడీ అన్నారు. వాళ్ల దుకాణాల వద్ద కులతత్వమనే విషం, అపారమైన అవినీతి అనే హామీలే ఉంటాయని ప్రధాని ఎద్దేవా చేశారు.