MLA Dr Ranganath: ఆపరేషన్‌కు సాయం కోసం వెళ్లాడు.. తానే స్వయంగా ఆపరేషన్ చేశాడు డాక్టర్ ఎమ్మెల్యే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Dr Ranganath: ఆపరేషన్‌కు సాయం చేయమని అడగడానికి ఒక రైతు తన నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లాడు. తానే డాక్టర్ కావడంతో.. తను ఆర్థిక సాయం చేయడం కంటే.. తానే స్వయంగా ఆపరేషన్ చేసి సమస్యను పరిష్కారం చేయాలని భావించాడు. దీంతో తనకు తెలిసిన ఆసుపత్రికి విషయం చెప్పి తానే రైతుకు ఆపరేషన్ చేశాడు ఎమ్మెల్యే. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. వైద్య వృత్తి ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన చాలా మంది డాక్టర్లు.. తర్వాత రాజకీయాల్లోకి వచ్చి కీలక పదవులను చేపట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు సహా.. బోలెడంత మంది నేతలు ఈ కోవలోకి వస్తారు. ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజా సేవలోకి అడుగుపెట్టిన డాక్టర్లు.. బిజీ షెడ్యూల్ కారణంగా వైద్య సేవలకు దూరం కావాల్సి వస్తోంది. కానీ కొందరు మాత్రం అవసరమైనప్పుడు వైద్యం అందిస్తూ.. ప్రాణాలను నిలబెడుతున్నారు. ఈ కోవకే చెందుతారు కర్ణాటక ఎమ్మెల్యే డాక్టర్ హెచ్‌డీ రంగనాథ్. డాక్టర్‌గా మంచి పేరున్న హెచ్‌డీ రంగనాథ్.. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కునిగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆర్థోపెడిక్ సర్జన్ అయిన ఆయన.. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ.. వీలు చిక్కినప్పుడల్లా వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు.
Read also: Minister Amarnath: దసరాకు విశాఖ ప్రజల కోరిక తీరబోతుంది.. మంత్రి అమర్‌నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read
తుమకూరు సమీపంలోని యాదవనికి చెందిన శివనంజయ్య అనే రైతు 20 ఏళ్లు మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఆయనది. శివనంజయ్యను పరీక్షించిన డాక్టర్లు అతడు రూమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నాడని.. మోకాలి కీళ్ల మార్పిడి సర్జరీ చేయాలని నిర్ణయించారు. మామూలుగా ప్రయివేట్ హాస్పిటళ్లలోనైతే ఈ సర్జరీకి రూ.2 లక్షలు ఖర్చవుతుందని.. కార్పొరేట్ హాస్పిట్‌లో అయితే రూ.5 లక్షల వరకు ఖర్చవుతుందని డాక్టర్లు అతడికి చెప్పారు.
తన దగ్గర అంత డబ్బు లేకపోవడంతో.. ఆర్థిక సాయం చేయాలని కోరేందుకు శివనంజయ్య ఎమ్మెల్యే డాక్టర్ హెచ్‌డీ రంగనాథ్ దగ్గరకు వెళ్లాడు. తన పరిస్థితిని వివరించి, సాయం చేయాలని కోరాడు. కానీ అతడికి డబ్బులిచ్చి పంపించడం కంటే తానే ఉచితంగా సర్జరీ చేస్తే ఇంకా బాగుంటుందని ఎమ్మెల్యే భావించారు. అనుకున్నదే తడవుగా.. తన స్నేహితుడైన డాక్టర్ దీపక్‌తో కలిసి బెంగళూరులోని బౌరింగ్ అండ్ లేడీ కర్జన్ హాస్పిటల్‌లో శివనంజప్పకు ఉచితంగా ఎడమ మోకాలు సర్జరీ చేశారు. మరో మూడు నెలల తర్వాత కుడి మోకాలి కీలు సర్జరీని కూడా ఉచితంగా చేస్తామని చెప్పారు. దీంతో ఆ రైతు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
Read also: Conjunctivitis: కండ్ల కలక వస్తే ఏం చెయ్యాలో?.. ఏం చెయ్యకూడదో తెలుసా?
ఎన్నికల ప్రచారం సమయంలో కునిగల్ తాలుకాలోని కుందూరు అనే గ్రామానికి డాక్టర్ రంగనాథ్ వెళ్లారు. ఆ ఊరికి చెందిన ఆశా శంకర్ అనే 42 ఏళ్ల మహిళ తన ఆరోగ్య పరిస్థితిని గురించి ఆయనకు చెప్పుకుంది. ‘నా పేరు ఆశా. స్కూల్లో వంట మనిషిగా పని చేస్తున్నాను. నాకు 12 ఏళ్ల క్రితం హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేశారు. ఈ మధ్య ఇంటి దగ్గర కింద పడిపోయా. అప్పటి నుంచి తుంటి భాగంలో నొప్పి వస్తోంది, నడవలేకపోతున్నానయ్యా. హాస్పిటల్‌కు వెళ్లి చూపించుకుంటే సర్జరీ చేయాలని చెప్పారు. రూ.5 లక్షల నుంచి రూ. 6 లక్షలు ఖర్చవుతుందన్నారు. మా ఆయన ఆటో డ్రైవర్. ఆపరేషన్‌కు అంత మొత్తమంటే మా వాళ్ల కాదయ్యా.. మీరే ఏదైనా దారి చూపించాలి’ అని ఆమె వేడుకుంది. ఆమె మెడికల్ రిపోర్టులను పరిశీలించిన డాక్టర్ రంగనాథ్.. ఎన్నికల హడావుడి కాస్త తగ్గనీయమ్మా.. నీకు నేనే ఫ్రీగా సర్జరీ చేస్తానని చెప్పారు. అన్నట్టుగానే జూన్ 26న ఆమెకు బెంగళూరులోని బౌరింగ్ హాస్పిటల్‌లో ఉచితంగా సర్జరీ చేశారు.
తాజావార్తలు
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!