Naveen Patnaik: నవీన్ పట్నాయక్ కొత్త రికార్డు.. ఎక్కువ కాలం సీఎంగా కొనసాగిన రెండో వ్యక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naveen Patnaik: ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి.. ప్రధాన మంత్రి కావడం చాలా కష్టం. అలాంటిది ముఖ్యమంత్రి అయిన తరువాత సుదీర్ఘంగా కొనసాగడం ఇంకా కష్టం. కానీ ఏకంగా 5 పర్యాయాలు సీఎంగా కొనసాగుతూ రికార్డు సృష్టించిన వ్యక్తులు అరుదుగా ఉంటారు. అటువంటి వారి జాబితాలో ఇపుడు ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చేరారు. ఆయన ఏకంగా ఎక్కువ కాలం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కొనసాగిన జ్యోతిబసు రికార్డును బద్దలు కొట్టి రెండోస్థానంలో నిలిచారు. సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్‌కుమార్ చామ్లింగ్ మొదటి స్థానంలోనే కొనసాగుతున్నారు.
Read also: Credit Card Update: క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాక్.. యాన్యువల్ ఫీజు భారీగా పెంపు
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
సుదీర్ఘ కాలం కొనసాగిన రెండో ముఖ్యమంత్రిగా పశ్చిమబెంగాల్ దివంగత సీఎం జ్యోతి బసు పేరిట ఉన్న రికార్డును ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తిరగరాశారు. దేశంలోనే సుదీర్ఘ కాలంపాటు, 24 ఏళ్లకు పైగా అధికారంలో కొనసాగిన సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్‌కుమార్ చామ్లింగ్ మొదటి స్థానంలోనే కొనసాగుతున్నారు. ఆయన తర్వాత కమ్యూనిస్టు యోధుడు జ్యోతి బసు 1977 జూన్ 21 నుంచి 2000 నవంబర్ 5వ తేదీ వరకు 23 ఏళ్ల 137 రోజులు సీఎంగా కొనసాగారు. ఒడిశా సీఎంగా 2000 మార్చి 5న మొదటిసారిగా బాధ్యతలు చేపట్టిన నవీన్ పట్నాయక్ అయిదు పర్యాయాలు ఆ రాష్ట్రానికి సీఎంగా ఎన్నికై శనివారం నాటికి 23 సంవత్సరాల 138 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో చామ్లింగ్ తర్వాత రెండో స్థానంలోకి చేరారు. పవన్ కుమార్ చామ్లింగ్, జ్యోతి బసు తర్వాత వరుసగా అయిదు పర్యాయాలు సీఎంగా ఎన్నికైన నేతగానూ నవీన్ పట్నాయక్ మూడో స్థానంలో నిలిచారు. వచ్చే ఏడాది 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేడీ మళ్లీ విజయం సాధించి, సీఎంగా నవీన్ పట్నాయక్ పగ్గాలు చేపట్టిన పక్షంలో దేశంలోనే సుదీర్ఘకాలం సీఎంగా కొనసాగిన నేతగా మొదటిస్థానంలో నిలవడమే కాకుండా.. ఏకంగా 6 పర్యాయాలు సీఎంగా ఎన్నికైన వ్యక్తిగా కూడా నవీన్ పట్నాయక్ రికార్డు సృష్టిస్తారు.
Read also:Tomato: రూ.3లక్షల విలువైన టమాటాల చోరీ.. వందల కిలోమీటర్ల దూరంలో విక్రయం
వరుసగా ఐదవసారి ఒడిశా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నవీన్ పట్నాయక్‌కు 23 సంవత్సరాలు 138వ రోజు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 1997లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2000 మార్చి 5న నవీన్ పట్నాయక్ తొలిసారిగా ఒడిశా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నవీన్ పట్నాయక్ నాయకత్వంలో.. ఒడిశాలోని బిజూ జనతాదళ్ (2000, 2004, 2009, 2014, 2019) అధికారంలోకి వచ్చింది. నవీన్ పట్నాయక్ ఒడిశా ప్రజల మద్దతును నిరంతరం పొందుతున్నారు.23 ఏళ్ల పాలనలో నవీన్ పేరిట ఇదే మొదటి రికార్డు కాదు. బెస్ట్ అడ్మినిస్ట్రేషన్, నంబర్ వన్ ముఖ్యమంత్రి సహా పలు రికార్డులను నవీన్ సొంతం చేసుకున్నారు. నవీన్ పట్నాయక్ ఒడిశా ఆర్థిక, విద్య, ఆరోగ్యం , ఆహార భద్రత రంగాలలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. అదేవిధంగా పారిశ్రామికీకరణలో ఒడిశాలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. విదేశీ పెట్టుబడుల్లో దేశంలోనే ఒడిశా రెండో స్థానంలో నిలిచింది.
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!