తెలంగాణలో కుటుంబ పాలనను కూకటివేళ్లతో పెకిలించివేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కలలో కూడా ఊహించలేదు.. దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి వస్తుందని, తాను మూడుసార్లు ఎమ్మెల్యే అవుతానని, కేంద్ర మంత్రి అవుతానని అనుకోలేదు అని ఆయన తెలిపారు. ఏం ఆశించకుండా పార్టీ కోసం పనిచేశాను.. మా పోరాటం అవినీతి, కుటుంబపాలనపై.. తెలంగాణ ప్రజల భవిష్యత్ ను డైనింగ్ టేబుల్ మీద నిర్ణయించకూడదు అని టీబీజేపీ చీఫ్ అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఒక్కరి చేతిలో బందీ అయింది.. నయా నిజాం పాలనలో అందరూ బానిసలుగా ఉండాలని కేసీఆర్ కోరుకుంటున్నాడు.. కొడుకు, తర్వాత మనువడికి కూడా బానిసలుగా ఉండాలని అనుకుంటున్నాడు అని కిషన్ రెడ్డి పేర్కొన్నాడు.
Read Also: Rainy Season Food : వర్షాకాలంలో ఎందుకు కారంగా తినాలని అనిపిస్తుందో తెలుసా?
ఈ అహంకారపూరిత పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. యుద్ధమంటూ జరిగితే.. కత్తికి కూడా కనికరం ఉంటుందేమో కానీ.. తెలంగాణ ప్రజలకు కనికరం ఉండదు అని ఆయన పేర్కొన్నారు. బండి సంజయ్ ఉన్నప్పుడే యుద్ధం ప్రారంభమైంది.. కేసీఆర్.. ఇంకా ముందుంది ముసళ్ల పండుగ.. తెలంగాణలో ప్రజలు ఆందోళన చేసేందుకు అవకాశం లేదా అని ఆయన ప్రశ్నించారు. హౌజ్ అరెస్టులు చేసే సంప్రదాయం ఏంటి..నువ్ ఏ రకంగా ముఖ్యమంత్రి అయ్యావ్.. కేసీఆర్ అని కిషన్ రెడ్డి అడిగారు. మేమంతా పోరాడితే సీఎం సీటులో కూర్చున్నావ్..
కేసీఆర్ నువ్ మమ్మల్ని అరెస్టు చేయొచ్చు.. కానీ భవిష్యత్ లో నిన్ను ఫాంహౌజ్ లో అరెస్ట్ చేస్తాం.. ఖబర్దార్ అంటూ సవాల్ విసిరారు.
Read Also: Mamata Banerjee: బెంగాల్‌కు బృందాలను పంపిన కేంద్రం, మణిపూర్‌కు ఎందుకు పంపలేదు?
నువ్ దోపిడీ చేస్తే ఎవరూ మాట్లాడొద్దా.. పక్క రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు కడితే కేసీఆర్ కు సోయి లేదు అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. అదే ఆయన పది ఎకరాల్లో ప్రగతిభవన్ కట్టుకున్నాడు.. బాత్రూం కూడా బుల్లెట్ ప్రూఫ్ తో నిర్మించుకున్నాడు.. కంటోన్మెంట్ లో పదెకరాల స్థలాన్ని కాంగ్రెస్ కు ఎలా ఇచ్చింది.. ఆట మొదలైంది, తెలంగాణ ప్రజలు యుద్ధం చేస్తారు.. ఈ యుద్ధానికి ప్రజలకు అండగా బీజేపీ నిలుస్తుంది అని ఆయన అన్నారు.
Read Also: High Court: ఆర్-5 జోన్‍లో ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఉందా? ప్రశ్నించిన హైకోర్టు
ఓల్డ్ సిటీలో ఒకడున్నాడు.. తలకుమాసినోడు.. బీజేపీ మతతత్వ పార్టీ అని విమర్శలు చేస్తున్నాడు అని టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించాడు. అన్నాదమ్ముల్లను ఇద్దరినీ కిరణ్ కుమార్ రెడ్డి జైల్లో పెట్టాడు.. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒక్కటేనని ఆయన మండిపడ్డారు. ఎవరికి ఓటేసినా వృథానే.. బీజేపీకి ఎవరితోనూ పొత్తు లేదు.. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కాదు.. ఈ విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పబోం.. సంజాయిషీ ఇవ్వబోమన్నాడు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడు కుటుంబ పార్టీలే.. వెయ్యి మంది కేసీఆర్ లు వచ్చి తలకిందులు తపస్సు చేసినా, ఒక్క ఓవైసీ కాదు, లక్ష మంది అక్బరుద్దీన్, అసదుద్దీన్ లు వచ్చి తలలు నరుక్కున్నా.. ఒక్క రాహుల్ గాంధీ కాదు వేలాది మంది రాహుల్ గాంధీలు వచ్చినా 2024 లో మోడీ ప్రభుత్వం రాకుండా అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు అని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Read Also: High Court: ఆర్-5 జోన్‍లో ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఉందా? ప్రశ్నించిన హైకోర్టు
బీజేపీయేతర పార్టీలన్నీ కూటమి పెట్టుకున్నాయి. అందులో అందరూ ప్రధాని అభ్యర్థులేనని కిషన్ రెడ్డి ఆరోపించారు. వారు అధికారంలోకి వస్తే మూడు నెలలకో ప్రధాని మారుతాడు.. అలాంటి పాలన కావాలా? బీజేపీ కావాలా? మీరు ఆలోచించండి. బీజేపీ ఒక్కడుగు వెనక్కు వేసిందంటే.. పదడుగులు ముందుకు వేస్తుంది.. దేశంలో ఏ రాజకీయ పార్టీ ఇంత అవినీతి చేయలేదు.. అవినీతికి రారాజు కేసీఆర్.. ఆయన చేయని మాఫియా లేదు.. తెలంగాణలో బుల్డోజర్ ప్రభుత్వం రావాలి.. అవినీతిపరులకు సింహస్వప్నంగా మారుతామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.