Thummala Nageswara Rao: 6 గ్యారెంటీలకంటే నేను ఇంకో పధకం ఇస్తున్న అదే ప్రశాంతమైన ఖమ్మం అని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఒకప్పుడు ఈ కాలనీ నుంచి అర్ధరాత్రి కూడా నీళ్లకోసం ఫోన్ లు వచ్చేవన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి నేను మంచి సన్నిహితులం మని తెలిపారు. ఆ రోజున ఖమ్మం మొత్తానికి చిన్న పార్క్ కూడా ఉండేది కాదని తెలిపారు. పెరిగే ఖమ్మంను చూసి కబ్జాలకు గురవుతున్న.. 500 ఎకరాల్లో వెలుగుమట్ల పార్కును ఏర్పాటు చేశానని తెలిపారు. మంత్రి ఓ మాఫియా ను తయారు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత వాతావరణంను విచ్చిన్నం చేశారని అన్నారు. డిసెంబర్ 3న తర్వాత ఇవేమీ ఉండవన్నారు. తండ్రి ఉగ్రవాదుల చేతుల్లో హతమైనప్పటికీ దేశం కోసం రాహుల్ పోరాటం చేస్తున్నాడని తెలిపారు. 6 గ్యారెంటీలకంటే నేను ఇంకో పధకం ఇస్తున్న అదే ప్రశాంతమైన ఖమ్మం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 9న ప్రమాణ స్వీకారం చేయబోతోందని తెలిపారు. మీరందరూ ఆ కార్యక్రమానికి అతిథులుగా రావాలని ఆహ్వానించారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ ఏడాది జూలైలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా, తుమ్మల నాగేశ్వరరావు ఈ ఏడాది సెప్టెంబర్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే బిఆర్‌ఎస్ టిక్కెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యేకే కేటాయించారు. దీంతో అసంతృప్తితో ఉన్న తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. ఆ పార్టీ ఆహ్వానం మేరకు తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Gangula Kamalakar: గంగులకు హైకోర్టులో ఊరట.. పొన్నం పిటిషన్ కొట్టివేత