Diwali Holidays: దీపావళి పండుగకు ఈ ఆదివారం సెలవు ఇస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. అయితే 13 సోమవారం దీపావళి సెలవు ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం 13న వివిధ స్థాయిల్లో సమావేశాలు, శిక్షణ తరగతులు ఉన్నాయని, ఒకవేళ సెలవు ప్రకటిస్తే ఆ కార్యక్రమాలు సజావుగా నిర్వహించలేమని, అందుకే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన. నిరాకరిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం దీపావళి సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం ప్రకటించే విధంగానే తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది సెలవులను గతేడాది చివర్లో విడుదల చేసింది. దీని ప్రకారం నవంబర్ 12వ తేదీ ఆదివారం సెలవు ఇచ్చారు.
అయితే తాజాగా పండితులు దీపావళిని నవంబర్ 13న జరుపుకోవాలని సూచించడంతో తెలంగాణ ప్రభుత్వం నిన్న సెలవులను కూడా మార్పులు చేశారు. ఈ మేరకు నవంబర్ 13వ తేదీని సెలవు దినంగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి, దీపావళి సెలవుదినం మునుపటిలా నవంబర్ 12న మరియు ఐచ్ఛిక సెలవు నవంబర్ 13న ఇవ్వబడింది. ఇప్పుడు దీన్ని సవరించి నవంబర్ 13ని దీపావళికి సాధారణ సెలవుగా మార్చారు. ఈ విధంగా, పండుగ తర్వాత రోజు నవంబర్ 14 నుండి ప్రత్యామ్నాయ సెలవుదినం అమలులోకి వస్తుంది. తెలంగాణలో ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం చేసిన తాజా మార్పుతో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు మూడు రోజుల వారాంతపు సెలవులు లభించాయి. ఈసారి తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 11వ తేదీ రెండో శనివారం సెలవు. మరుసటి రోజు ఆదివారం కావడంతో నవంబర్ 12న సెలవు ఉంటుంది. ఇప్పుడు దీపావళి సెలవుల సందర్భంగా నవంబర్ 13న కూడా సెలవు ఇచ్చారు. దీంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం 13న ఇచ్చిన సెలవుదినంగా కాకుండా కేంద్రం ఎన్నికల సంఘం 12న సెలవుదినంగా ప్రకటించడంతో ఆశక్తి కరంగా మారింది. దీంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. మరి 13న పరిస్థితి ఏంటని ప్రశ్నలు మొదలయ్యాయి. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సెలవు ప్రకారం 12న సెలవులు అయిపోతాయి కావున 13న అంటే సోమవారం నుంచి స్కూళ్లకు యధావిధిగా వెళ్లాల్సిందే మరి.
MLA Laxmareddy: కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు.. నమ్మి మోసపోతే గోసపడుతాం