Election Commission: మే 13వ తేదీన జరిగిన పోలింగ్ సమయంలో రాష్ట్రంలో జరిగిన హింసత్మక ఘటనలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ సీఎస్ జవహర్ రెడ్డితో పాటు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు నోటీసులు ఇచ్చింది. గురువారం ఢిల్లీకి వచ్చిన దాడులపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బుధవారం ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్ తో సీఎస్, డీజపీ సమావేశం అయ్యారు. అయితే, ఈ భేటీలో మాచర్ల, నరసరావుపేట, తాడిపత్రి, అనంతపురం, గురజాల ఘటనలపై సమీక్షించారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై ప్రధానంగా చర్చలు జరిపారు.
Read Also: KCR Protest: నేడు బీఆర్‌ఎస్ రాష్ట్రవ్యాప్త నిరసన.. శ్రేణులకు కేసీఆర్ పిలుపు
ఇక, ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి నేడు ( గురువారం ) ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నివేదిక రెడీ చేసినట్లు సమాచారం. కాగా, మాచర్లలో మొత్తం 144 సెక్షన్ అమలు చేశామన్నారు సీఈసీకి వివరించనున్నారు. హింసాత్మక ఘర్షణ విషయంలో ఇప్పటి వరకు ఎన్ని కేసులు పెట్టాం.. ఎంత మందిని అదుపులోకి తీసుకున్నామనే విషయాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలపనున్నారు.
Read Also: AP EAPCET: నేటి నుంచే ఏపీ ఈఏపీసెట్.. నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ!
కాగా, ఏపీలో పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసపై.. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మండిపడింది. పోలింగ్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల జరిగిన ఘర్షణలను మూడు రోజులు అయినా ఎందుకు అదుపులోకి తీసుకు రాలేదని ఈసీ ప్రశ్నించింది. అయితే, ఇప్పటికే పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంది.. సత్తెనపల్లి, మాచర్ల, పిడుగురాళ్లలో షాపులు కూడా మూయించారు పోలీసులు. ఏపీలో పోలింగ్ రోజున మొదలైన గొడవలు.. హింసాత్మకంగా మారుతుండటంతో.. కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. పోలింగ్ తర్వాత హింసను ఎందుకు అరికట్టలేకపోయాలో వివరించాలని సీఎస్, డీజీపీలను ఆదేశించింది ఈసీ.