మే 13న జరిగిన ఎన్నికల భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ పోలింగ్ నమోదు అయ్యింది. ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ తో కలిపి 81.76% పోలింగ్ నమోదయింది. ఇందులో ఈవీఎంల ద్వారా 80.6% పోలింగ్ నమోదయింది. పోస్టల్ బ్యాలెట్ నుండి 1.1% ఓట్లు నమోదు అయ్యాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా చూస్తే ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 87.09% ఓట్లు నమోదు అవ్వగా.. అత్యల్పంగా విశాఖ జిల్లాలో 68.63% ఓట్లు నమోదు అయ్యాయి. ఇక జిల్లాల వారీగా ఓటింగ్ శాతం గమనిస్తే ఇలా ఉంది.
* అల్లూరి జిల్లాలో 70.20%.
* అనకాపల్లి జిల్లాలో 83.84%
* అనంతపురం జిల్లాలో 81.08%.
* అన్నమయ్య జిల్లాలో 77.83%
* బాపట్ల జిల్లాలో 85.15%.
* చిత్తూరు జిల్లాలో 87.09%
* కోనసీమ జిల్లాలో 83.84%.
* తూ.గో. జిల్లాలో 80.93%.
* ఏలూరు జిల్లాలో 83.67%.
* గుంటూరు జిల్లాలో 78.81%.
* కాకినాడ జిల్లాలో 80.31%.
* కృష్ణా జిల్లాలో 84.05%
* కర్నూలు జిల్లాలో 76.42%.
* నంద్యాల జిల్లాలో 82.09%
* ఎన్టీఆర్ జిల్లాలో 79.36%.
* పల్నాడు జిల్లాలో 85.65%.
* పార్వతీపురం మన్యం జిల్లాలో 77.1%.
* ప్రకాశం జిల్లాలో 87.09%.
* నెల్లూరు జిల్లాలో 79.63%.
* శ్రీసత్యసాయి జిల్లాలో 84.63%.
* శ్రీకాకుళం జిల్లాలో 75.59%.
* తిరుపతి జిల్లాలో 78.63%.
* విశాఖ జిల్లాలో 68.63%.
* విజయనగరం జిల్లాలో 81.33%.
* ప.గో. జిల్లాలో 82.59%.
* కడప జిల్లాలో 79.58%.