వికారాబాద్ జిల్లాలోని తాండూరు నియోజకవర్గంలో నేడు పర్యటించబోతున్నారు. తాండూరులో జనసేన అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ తరపున ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.
నేడు మూడు నియోజకవర్గాల్లో నిర్వహించనున్న బహిరంగ సభకు అమిత్ షా హాజరవుతారు. అనంతరం ఖైరతాబాద్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించనున్నారు. మరోవైపు రేపు కూడా రాష్ట్రంలో అమిత్ షా ఎన్నికల ప్రచారం చేయనున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకున్న వేళ గులాబీ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారం మరింత స్పీడ్ పెంచారు. నేడు మరో నాలుగు ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొననున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ మక్తల్ రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 3 తర్వాత కొన్ని పథకాలు ప్రారంభిస్తున్నామని తెలిపారు. 2014లో సిలిండర్ కు మొక్కండి.. ఓటు వేయండి అని మోదీ అన్నారు. ఆనాడు రూ.400 సిలిండర్ ఇప్పుడు రూ.1200 అయ్యిందని కేటీఆర్ తెలిపారు. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తాం.. రేషన్ కార్డులు ఉన్నవారికి సన్న బియ్యం ఇస్తామని ఈ సందర్భంగా చెప్పారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంటలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానకొండూర్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మార్పు రావాలి కాంగ్రెస్ గెలవాలి, బై బై కేసీఆర్ నినాదంతో రేవంత్ రెడ్డి కార్యకర్తల్లో జోష్ నింపారు. కరీంనగర్ గడ్డ మీద తెలంగాణ రాష్ట్రం ఇస్తామని సోనియమ్మ మాట ఇచ్చింది..…
ఎన్నికలకు మరో వారం రోజులపాటు సమయం ఉండటంతో రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అన్నీ నియోజకవర్గాల్లో పర్యటించేలా షెడ్యూల్ చేసుకుని ప్రచారం చేస్తున్నారు ముఖ్య నేతలు.. ఈ క్రమంలో తెలంగాణలో మరోసారి పర్యటించనున్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ. రేపు, ఎల్లుండి ఎన్నికల ప్రచార సభలలో పాల్గొననున్నారు.
సంగారెడ్డిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను అభివృద్ధి చేయడం కంటే అప్పుల కూపీలోకి తీసుకెళ్లారని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబ దోపిడీ తెలంగాణలో సాగుతుందని.. కేసీఆర్ పాలనలో భారీ అవినీతి జరుగుతుందని ఆయన మండిపడ్డారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ప్రజా సమస్యలపై పోరాటమే ధ్యేయంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో ఆయన సతీమణి లకుమాదేవి పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ.. కూకట్పల్లి డివిజన్లో చేపట్టిన యాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ఇంటింటి ప్రచారంలో ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని.. మహిళలు మంగళ హారతులతో దీవించారని అన్నారు.