తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. కుండపోత వానలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. మరో రెండ్రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో నేటి నుంచి వాజేడు బొగత జలపాతం పర్యాటకుల సందర్శన నిలిపివేశారు అధికారులు. గత రెండు రోజులుగా పెనుగోలు గుట్టల పై ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు బొగత జలపాతం ప్రమాద స్థాయి దాటి ప్రవహించడంతో బోగత జలపాతం సందర్శన నిలిపివేసిన అధికారులు. అదేవిధంగా రానున్న రెండు రోజులలో వాతావరణ శాఖ…
Edupayala Temple: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గాదేవి క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి.
మెదక్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడు పాయల ఆలయం గత ఎనిమిది రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో ఆలయం ఎదుట 8 రోజులుగా మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది.
Edupayala Temple: మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ఇంకా జలదిగ్బంధంలో ఉంది. భారీ వర్షాల కారణంగా సింగూరు ప్రాజెక్టు రెండు గేట్లను అధికారులు ఎత్తివేశారు.
మెదక్ జిల్లాలోని ఏడు పాయల ఆలయం వద్ద మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. అమ్మవారి గర్భగుడిలోనికి మంజీరా వరద ప్రవేశించింది. మంజీరా బ్యారేజ్ గేట్లు ఓపెన్ చేయడంతో భారీగా వరద వచ్చింది.
Medak: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. నవరాత్రులలో, తొమ్మిది రోజుల పాటు, దుర్గా దేవి యొక్క తొమ్మిది విభిన్న రూపాలను పూజిస్తారు. ఇందులో భాగంగా మెదక్ జిల్లా ఏడు పాయలలో వన దుర్గా మాత దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఐదవరోజు భాగంగా మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనిమస్తున్నారు. 5 లక్షల 11 వేల నగదుతో అమ్మవారిని అర్చకులు అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు అమ్మవారిని చూసేందుకు పెద్ద…
మెదక్ జిల్లా పాపన్నపేటలోని ఏడు పాయల ఆలయం వద్ద వరద నీరు స్వల్పంగా తగ్గింది. 10 రోజులుగా వన దుర్గా భవాని ఆలయం జలదిగ్బంధంలోనే వుంది. ఈ ఏడాదిలో ఇప్పటికే 64 రోజులు ఆలయం మూతపడింది.
ఏడుపాయల దుర్గామాతకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు సమర్పించి మహాశివరాత్రి జాతర ఉత్సవాలను మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు కు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏడుపాయల కు పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని ఆయన…