Edupayala Temple: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గాదేవి క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ వనదుర్గా భవాని కాత్యాయని రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి నీలి రంగు వస్త్రంతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సింగూరు ప్రాజెక్టు నుంచి వరద వస్తుండటంతో ఆలయం వద్ద మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో ఏడు రోజులుగా ఏడు పాయల ఆలయం జలదిగ్బంధంలో ఉండటంతో, అర్చకులు రాజగోపురంలోనే దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
కాగా.. ఆలయం ముందున్న ఏడు పాయల్లో ఒకటైన నదీ పాయ ఉధృతంగా ప్రవహించడంతో మూలవిరాట్ అమ్మవారిని దర్శించుకునే భాగ్యం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రాజగోపురంలో ప్రతిష్టించిన ఉత్సవ విగ్రహం వద్ద పూజలు నిర్వహించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక.. మూలవిరాట్ అమ్మవారిని దర్శించుకునే భాగ్యం లేకుండా పోయిందేనని భక్తులు నిరాస వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఆలయ ప్రాంగణంలోని గోకుల్ షెడ్ లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ అర్చకులు వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు కొనసాగిస్తూ భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు.
Bandi Sanjay: జర్నలిస్టుల నోటికాడ ముద్దను లాగేసుకుంటారా? సీఎం రేవంత్‌కు బండి సంజయ్ లేఖ