తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. కుండపోత వానలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. మరో రెండ్రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో నేటి నుంచి వాజేడు బొగత జలపాతం పర్యాటకుల సందర్శన నిలిపివేశారు అధికారులు. గత రెండు రోజులుగా పెనుగోలు గుట్టల పై ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు బొగత జలపాతం ప్రమాద స్థాయి దాటి ప్రవహించడంతో బోగత జలపాతం సందర్శన నిలిపివేసిన అధికారులు. అదేవిధంగా రానున్న రెండు రోజులలో వాతావరణ శాఖ ములుగు జిల్లాలో భారీ నుంచి అతివారి వర్షాలు కురుస్తాయని సూచించింది. దీంతో జలపాతానికి భారీగా వర్షపు నీరు చేరే అవకాశం ఉండటంతో పర్యాటకుల రక్షణ చర్యలో భాగంగా బొగత జలపాత సందర్శిన నిలిపి వేశారు.
Also Read:Donald Trump: రష్యా నుంచి చమురు కొనుగోలు.. భారత్‌పై అదనపు టారిఫ్‌లు లేనట్లే?: ట్రంప్
ఏడు పాయల ఆలయం 4 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. మంజీరా నది ఆలయాన్ని చుట్టుముట్టింది. ఆలయం ఎదుట ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది మంజీరా నది. వరద ఎఫెక్ట్ తో నాలుగో రోజు ఏడుపాయల ఆలయం మూసివేశారు అధికారులు. రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి. ఎగువన సింగూరు ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తడంతో ఆలయం వద్ద మంజీరా నది ఉధృతి మరింత పెరిగింది. గర్భగుడిలోకి ప్రవేశించి అమ్మవారి పాదాలను తాకుతూ వెళ్తున్నాయి మంజీరా జలాలు.