Edupayala Temple:మెదక్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడు పాయల ఆలయం గత ఎనిమిది రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో ఆలయం ఎదుట 8 రోజులుగా మంజీరా నది పరవళ్లు తొక్కుతోంది. అమ్మవారి పాదాలను తాకుతూ మంజీరా వరద వెళుతోంది. ఆలయం ఎదుట ప్రమాదకర స్థాయిలో మంజీరా ప్రవహిస్తోంది. గత ఎనిమిది రోజులుగా జలదిగ్బంధంలోనే ఏడు పాయల ఆలయ ఉండడంతో.. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి.
Read Also: Bhatti Vikramarka: సీఎంఆర్ పెండింగ్.. మిల్లులపై కఠిన చర్యలకు డిప్యూటీ సీఎం ఆదేశాలు
భారీ వర్షాలతో సెప్టెంబర్ నెలలో 17 రోజులు ఆలయం మూతపడింది. వరద తగ్గిన తర్వాత అమ్మవారిని దర్శించుకుంటామని ఆలయ ఈవో వెల్లడించారు. సింగూరు ప్రాజెక్టు నుంచి భారీగా వరద వస్తున్నందున మంజీరా నదిలో చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. వనదుర్గ ప్రాజెక్టు వైపు ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. కాగా, సింగూరు ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పోటెత్తింది.