Edupayala Temple: ఏడు పాయల ఆలయం మరోసారి మూతపడింది. సింగూరు గేట్లు నిన్న రాత్రి ఎత్తడంతో ఆలయం ముందు మంజీరా నది ఉదృతంగా ప్రవహిస్తుంది. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజులపాటు జలదిగ్బంధంలో ఉండి రెండ్రోజుల క్రితమే ఆలయం తెరిచి పూజలు నిర్వహించారు. అయితే మంజీరా నది ఉదృతి పెరగడంతో ఆలయ అధికారులు ఆలయాన్ని మరోసారి మూసివేశారు.
Read also: Gold Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో నేటి రేట్స్ ఇవే!
వరద తగ్గిన తర్వాత అమ్మవారిని దర్శించుకుంటామని ఆలయ ఈవో వెల్లడించారు. సింగూరు ప్రాజెక్టు నుంచి భారీగా వరద వస్తున్నందున మంజీరా నదిలో చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. వనదుర్గ ప్రాజెక్టు వైపు ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. కాగా, సింగూరు ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పోటెత్తింది. ప్రాజెక్టుకు ప్రస్తుతం 28,181 క్యూసెక్కుల వరద వస్తుండగా, 15,114 క్యూసెక్కులు దిగువకు వెళ్తున్నాయి. సింగూరు పూర్తిస్థాయి నీటి సరఫరాలో 29.91 టీఎంసీలు. ఇప్పుడు 28.939 టీఎంసీలు నిల్వ ఉంది. జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
Jammu Kashmir : మరో 20 సీట్లు గెలిస్తే బీజేపీ నేతలు జైల్లో ఉండేవారు…..ఖర్గే ప్రకటనపై స్పందించిన బీజేపీ