కామారెడ్డిలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలతో చోటుచేసుకున్న వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. బీబీపేట పెద్ద చెరువు ప్రమాదకరంగా మారింది. చెరువుకు బుంగ పడటం తో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా బీబీపేట దిగువన ఉన్న షేర్ బీవీపేట గ్రామస్తులను ఖాళీ చేయించారు. జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు మరో రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది విద్యా శాఖ. Also Read: Telangana Flood Rescue : తెలంగాణలో ఇవాళ 1,444…
మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కోసం అన్ని విద్యాసంస్థల్లో ఈగల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. విద్యాసంస్థల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు ఇవి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.. ఒక్కో క్లబ్ లో టీచర్లు, లెక్చరర్లు, విద్యార్థులు కలిపి సభ్యులుగా మొత్తం 10 మంది ఉండేలా చూసుకోవాలని సూచించింది..
Telangana Govt: భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మరణించిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు ఈ రోజు (డిసెంబర్ 27) సెలవు ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
Komaram Bheem: కొమురం భీం జిల్లాలో నేడు విద్యాసంస్థల బంద్ కి విద్యార్ధి సంఘాల పిలుపు నిచ్చాయి. వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థి శైలజ మృతికి ప్రభుత్వ అధికారులే నిర్లక్ష్యం కారణమని, బంద్ కు పిలుపు నిచ్చారు. మృతి చెందిన శైలజ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, 50 లక్షల ఎక్స్ గ్రేషియ ఇవ్వాలని, వాంకిడి మండలం బంద్ తో పాటు, జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.…
బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మరోవైపు.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. రానున్న 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో.. రేపు ఆంధ్రప్రదేశ్లోని మరికొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్లు.
రేపు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు. ఇప్పటికే జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో.. జిల్లాలోని కళాశాలలకు, అన్ని విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు.
ఏపీలో భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించి రేపు ( సోమవారం ) విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని ఎడ్యూకేషన్ డిపార్ట్మెంట్ అధికారులను ఆదేశించారు.
Jayashankar Badibata: నేటి నుంచి బడిబాట కార్యక్రమాన్ని విద్యాశాఖ చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచేందుకు ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల కోసం వెతుక్కుంటూ తమ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు.