Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఇక, ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి.. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వార్నింగ్ ఇస్తోంది.. మరోవైపు.. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు అల్లూరి ఏజెన్సీలో వాగులు, గెడ్డలు ఉప్పొంగి ప్రవహిస్తు న్నాయి. వీటిని దాటుకుని రాకపోకలు సాగించేందుకు గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఇక, అల్లూరి సీతారామరాజు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు నేడు, రేపు స్థానిక సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్.
Read Also: Leeds Riots: బ్రిటన్‌లోని లీడ్స్‌లో అల్లర్లు.. పోలీసు వాహనాల ధ్వంసం..!
ఇక, ముంచింగి పుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ కోడా పుట్టు, ఉబ్బింగుల, దొరగుడ గ్రామాల గిరిజనులు తీవ్ర అవస్ధలు పడుతున్నారు. ఉబ్బింగుల గ్రామం నుంచి లక్ష్మీపురం వచ్చే మార్గంలో ఉన్న గెడ్డ వర్షాలకు పొంగి ప్రవహిస్తోంది. గెడ్డకు అవతల వైపు ఉన్న ఉబ్బెంగుల, దొరగుడ గిరిజనులు ఆ ప్రవాహంలో దిగి ప్రయాణిస్తేనే కనీసం పంచాయతీ కేంద్రానికి చేరగలరు. ఈ గెడ్డపై వంతెన నిర్మించాలని, రెండు గ్రామాలకు రహదారి సదుపాయం కల్పిం చాలని అనేకమార్లు అధికారులకు తెలిపినా ఫలితం లేదంటున్నారు. కోడాపుట్టు సమీపంలో గెడ్డ ప్రవాహం పెర గడంతో గ్రామస్తులంతా గ్రామాల్లో మగ్గిపోయారు. బిరిగుడ గెడ్డపై వంతెన నిర్మాణం పూర్తయితే ఇబ్బందులు తొలగు తాయని, పనులు వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. వర్షాల నేపథ్యంలో.. విద్యార్థులు.. విద్యాసంస్థలకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో.. కలెక్టర్ రెండు రోజుల పాటు స్కూళ్లు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.