నకిలీ సర్టిఫికెట్ లను అరికట్టేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో రేపు అన్ని యూనివర్సిటీ వీసీలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి డీజీపీ మహేందర్ రెడ్డి హాజరు కానున్నారు. వెబ్‌సైట్‌లో స్టూడెంట్ అకడమిక్ రికార్డ్స్ వేరిఫికేషన్ సర్వీసెస్ ను ఉన్నత విద్యామండలి అందుబాటులోకి తీసుకురానుంది. స్టూడెంట్ అకడమిక్ రికార్డ్స్ వేరిఫికేషన్ సర్వీసెస్ ద్వారా, నకిలీ సర్టిఫికెట్ దందా ను అరికట్టడం, ఉద్యోగాలు ఇచ్చే సంస్థలకు సర్టిఫికెట్స్ వేరిఫికేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించడం జరుగుతుందని అధికారులు…
దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది.. నిన్న లక్ష దాటేసి 1.14 లక్షలకు పైగా కేసులు నమోదైతే.. ఇవాళ ఏకంగా 1,41,986 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇక, తెలుగు రాష్ట్రాల్లోనూ క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది.. తెలంగాణలో నిన్న దాదాపు 3 వేల పాజిటివ్ కేసులు వెలుగు చూడగా.. ఆంధ్రప్రదేశ్‌లో 840 కేసులు నమోదు అయ్యాయి.. కోవిడ్ ఆంక్షలు కూడా విధించింది ఆంధ్రప్రదేశ్.. ఇవాళ్టి నుంచి నైట్ కర్ఫ్యూకు వెళ్తున్నారు.. ప్రస్తుతానికి తెలంగాణలో…
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి రాష్ర్ట ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ర్టంలో అవసరమైతే పాఠశాలల, కళాశాలలు మూసివేయాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత మహమ్మారి పరిస్థితిపై సమీక్ష చేపట్టాలని అడ్మినిస్ట్రేటివ్ సమావేశంలో అధికారులను ఆదేశించారు. ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా ఉన్నందు వల్ల కోల్‌కతాలో కంటైన్ మెంట్ జోన్లను గుర్తించాలని పేర్కొన్నారు. Read Also:సీఎం జగన్ అమూల్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు: దూళిపాళ్ల నరేంద్ర మంగళవారం బెంగాల్‌లో 752 కేసులు…
రాష్ట్రంలో భారీ వర్షాల దృష్ట్యా రేపు సెలవుగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.. వర్షాలు మరో రెండు రోజుల పాటు పడే అవకాశం ఉండడంతో.. అన్ని పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు సీఎం కేసీఆర్.. అయితే, అత్యవసర సేవలకు సంబంధించినవారు మాత్రం విధుల్లో ఉండాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, వరదలు, ప్రస్తుత పరిస్థితిపై సీఎస్ సోమేష్ కుమార్‌తో సమీక్ష జరిపారు సీఎం కేసీఆర్.. ఇక, రేపు అసెంబ్లీ సమావేశాల్లో.. సభను నిర్వహించడంపై…
దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలుచేస్తున్నారు. ప్రతిరోజూ కోటి మంది వరకు టీకాలు తీసుకుంటున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే విద్యాసంస్థలను ఒపెన్ చేశారు. అర్హులైన ప్రతి విద్యార్ధి, ఉపాద్యాయులు, నాన్ టీచింగ్ స్టాఫ్ టీకాలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ప్రధానోపాద్యాయులు, పీహెచ్‌సీలు సమన్వయంతో టీకాలు వేయాలని, ఈ విషయంలో కలెక్టర్లు చొరవ తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. సెప్టెంబర్ 10 వ తేదీలోగా విద్యాసంస్థల్లో 100శాతం వ్యాక్సినేషన్ పూర్తికావాలని ఆదేశించింది.…
దాదాపు 18 నెలల తర్వాత సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రత్యక్ష బోధనకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం.. అయితే, దీనిపై కీలక ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు… ఓవైపు రేపటి నుంచి తెలంగాణలో ప్రత్యక్ష తరగతులకు అనుమతి ఇస్తూనే.. విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై బలవంతం చేయవద్దన్న హైకోర్టు, విద్యార్థులు, మేనేజ్‌మెంట్‌పై ఒత్తిడి తేవద్దు.. పేరెంట్స్ నుంచి ఎలాంటి రాతపూర్వక హామీ తీసుకోవద్దని పేర్కొంది. కేవలం గురుకులాలు, హాస్టళ్లలో ప్రత్యక్ష బోధనపై హైకోర్టు స్టే విధించింది.. గురుకులాలు, విద్యాసంస్థల్లో…
దాదాపు 18 నెలల తర్వాత తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో… బడులు ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించింది. ఏడాదిన్నర తర్వాత… విద్యార్థులకు ప్రత్యక్ష బోధన జరగనుంది. పాఠశాలల్లో పూర్తి స్థాయిలో శానిటైజేషన్, క్లీనింగ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల యాజమాన్యాలు… తరగతి గదులను శుభ్రం చేస్తున్నాయి. క్లాసు రూమ్‌లతో పాటు బెంచ్‌లు, కుర్చీలను… శానిటైజ్ చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే… ఈ సారి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల…
తెలంగాణ కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేసుల తగ్గుముఖం, లాక్‌డౌన్ ఎత్తివేతతో అన్ని కేటగిరీల విద్యా సంస్థలను పూర్తిస్థాయి సన్నద్థతతో జూలై 1 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. శనివారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విద్యా సంస్థలు ప్రారంభం అయినప్పటి నుంచి విద్యార్థులు, సిబ్బంది కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని కేబినెట్ పలు సూచనలు చేసింది. కాగా తెలంగాణలో లాక్ డౌన్ ను సంపూర్ణంగా ఎత్తివేయాలని కాసేపటి…