AP Government: మాదక ద్రవ్యాల కట్టడిపై సీరియస్‌గా ఉన్న కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే పలు రకాలుగా వాటిపై యుద్ధం ప్రకటించింది.. ఇక, ఏపీ విద్యాసంస్థల్లో మాదకద్రవ్యాల వ్యతిరేక క్లబ్ (ఈగల్) ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న విషయం విదితమే కాగా.. ఇప్పుడు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కోసం అన్ని విద్యాసంస్థల్లో ఈగల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. విద్యాసంస్థల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రోత్సహించేందుకు ఇవి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.. ఒక్కో క్లబ్ లో టీచర్లు, లెక్చరర్లు, విద్యార్థులు కలిపి సభ్యులుగా మొత్తం 10 మంది ఉండేలా చూసుకోవాలని సూచించింది..
Read Also: Machine Learning Course: ఫ్రీ.. ఫ్రీ.. మెషిన్ లెర్నింగ్ కోర్సును ఉచితంగా నేర్పిస్తున్న గూగుల్
ఇలా ఏర్పాటు చేసిన ఒక్కో క్లబ్ పదవీకాలం ఏడాది పాటు ఉంటుందని ఉత్తర్వుల్లో వెల్లడించింది ప్రభుత్వం.. విద్యా సంస్థల్లో మత్తుపదార్థాల వినియోగ నిషేధం, వాటి వల్ల ఉత్పన్నమయ్యే అనర్థాలను వివరించడమే లక్ష్యంగా ఈ క్లబ్ లు పనిచేస్తాయని పేర్కొంది కూటమి ప్రభుత్వం.. మొత్తంగా.. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఉన్నత విద్యా సంస్థల్లో ఈగల్ ఏర్పాటు చేయనున్నారు.. విద్యా సంస్థల్లో మత్తుపదార్థాల వినియోగం పెరిగి.. ఆ తర్వాత తీవ్ర పరిణామాలకు దారితీస్తోందనే విమర్శలు ఉన్న నేపథ్యంలో.. విద్యా సంస్థల్లోనే దానిపై అవగాహన కల్పించాలని నిర్ణయానికి వచ్చింద సర్కార్.. డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఇబ్బందులపై సదస్సులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటివి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది..