Nara Lokesh: 8వ తరగతి విద్యార్థులు ఏడో తరగతి పుస్తకాలు చదవడం లేదు.. దీనికి గత ప్రభుత్వమే కారణం..
- జాతీయ సర్వే సంస్థ అసర్ నివేదిక
- ప్రభుత్వ విద్యా వ్యవస్థలో జరిగిన విధ్వంసం
- పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఖర్చు
- క్షేత్ర స్థాయిలో ఫలితం లేదు
- మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ సర్వే సంస్థ అసర్ నివేదికతో జగన్ పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో జరిగిన విధ్వంసం బయటపడిందని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. ఆయన ప్రచారానికి మేనమామ, వాస్తవానికి కంసమామ అని మరోసారి రుజువైందని విమర్శించారు. “పబ్లిసిటీ కోసం వందల కోట్లు ఖర్చు చేశారే తప్ప విద్యా ప్రమాణాలు పెంచే కనీస చర్యలు తీసుకోలేదని తేటతెల్లం అయ్యింది. 2018లో నాటి టీడీపీ హయాంలో మెరుగ్గా ఉన్న ప్రభుత్వ విద్యా ప్రమాణాలు.. వైసీపీ పాలనలో ఎలా దిగజారాయో అసర్ నివేదిక స్పష్టంగా వెల్లడించింది. అడ్డగోలు జీవోలు తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలల మూసివేత, అక్షరాలు, అంకెలు గుర్తుపట్టలేని స్థితిలో విద్యార్థులు తయారయ్యారు. తగ్గిన హాజరు శాతం, తాగునీరు, మరుగుదొడ్లు లాంటి కనీస మౌలిక సదుపాయాలు లేవు. ఇలా అనేక అంశాలు గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని ఎండగడుతున్నాయి. ఎనిమిదో తరగతి విద్యార్థుల్లో దాదాపు సగం మంది రెండో తరగతి పుస్తకాలు సరిగా చదవలేని పరిస్థితి నెలకొంది.” అని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
READ MORE: 4 Days Works: 4 రోజులే పనిదినాలు.. కటింగ్స్ లేకుండా జీతాలు.. ఎక్కడంటే..!
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఈ విధ్వంసానికి గురైన విద్యా వ్యవస్థను గాడిన పెట్టేందుకు గత ఏడు నెలలుగా అనేక చర్యలు తీసుకున్నానని మంత్రి నారా లోకేష్ తెలిపారు. నిరంతరం అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు తెలుసుకుంటూ అనేక మార్పులకు నాంది పలికాలికినట్లు వెల్లడించారు. “ప్రభుత్వ విద్యావ్యవస్థలో ఎంత మంది విద్యార్థులు చదువుతున్నారు అని పక్కా లెక్కలు తీస్తున్నాం. మారుతున్న కాలానికి తగ్గట్టుగా పాఠ్యప్రణాళిక సిద్ధం చేయడం, విలువలతో కూడిన విద్య, విద్యార్థులను క్రీడలతో సహా ఇతర రంగాల్లో ప్రోత్సహించే గైడెన్స్ ఇస్తున్నాం. కనీస మౌలిక వసతులు కల్పించడం, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడం వరకూ అనేక అంశాలపై దృష్టి పెట్టి పనిచేస్తున్నాం. త్వరలోనే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రూపొందించి ప్రజలు, విద్యావేత్తల అభిప్రాయాలు తెలుసుకోబోతున్నాం.” అని వెల్లడించారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?