Polycet 2022 Schedule: ఏపీ వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఏపీ పాలీసెట్-2022 ప్రవేశ పరీక్షను ఈ ఏడాది మే నెలలో నిర్వహించారు. ర్యాంకులు సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను సోమవారం నాడు ఏపీ సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసింది. పాలీసెట్ కౌన్సిలింగ్‌కు హాజరయ్యేందుకు ఓసీ అభ్యర్థులు రూ.900 ఫీజును, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.500 ప్రాసెసింగ్ ఫీజును జులై27 నుంచి ఆగస్టు2 వరకు చెల్లించాలి. ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జులై29 నుంచి ఆగస్టు5 వరకు కొనసాగుతుంది. ఆగస్టు 6 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.
Read Also: Real Estate Crisis : రియల్ ఎస్టేట్ లో సంక్షోభం ఎందుకొచ్చింది..? ఎన్నికలయ్యే దాకా ఇంతేనా.?
తొలి ర్యాంక్ నుంచి 10వేల ర్యాంక్ వరకు వచ్చిన అభ్యర్థులు జూలై 29న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలి. 10,001 నుంచి 25,000 ర్యాంకు వచ్చిన వారు జూలై 30న, 25,001 నుంచి 40,000 ర్యాంకుల వారు జూలై 31న, 40,001 నుంచి 55000 ర్యాంకుల వారికి ఆగస్టు 1న, 55,001 నుంచి 71,000 మంది ర్యాంక్ హోల్డర్లు ఆగస్టు 2న, 71,001 నుంచి 87,000 మధ్య ర్యాంకులు సాధించిన వారు ఆగస్టు 3న, 87,001 నుంచి 1,04,040 ర్యాంకులు పొందిన వారు ఆగస్టు 4 న, 1,04,041 నుండి చివరి ర్యాంక్ వరకున్న అభ్యర్థులు ఆగస్టు 5న సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకావాలి. ర్యాంక్ హోల్డర్లందరూ విద్యార్హతల ధ్రువీకరణపత్రాలు, పాలిసెట్-2022 ర్యాంక్ కార్డుతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాలకు 7995681678, 7995865456 నంబర్లలో సంప్రదించవచ్చు.