తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో మరో కొత్త పథకం ప్రవేశపెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన కోసం బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన ‘బడుల బాగు’ పథకం త్వరలోనే పట్టాలెక్కనుంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ గురువారం ఈ పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు ఏడాదికి రూ.2000 కోట్ల చొప్పున రెండేళ్లలో రూ.4000 కోట్ల నిధులను కేటాయించనున్నట్లు…
కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థుల గురించి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. జలుబు, తీవ్ర జ్వరం లక్షణాలతో ప్రభుత్వ ఆస్పత్రిలో 14 మంది విద్యార్థులు చేరారు. వాతావరణ మార్పులతో వచ్చే వైరల్ జ్వరాలతోనే అస్వస్థతకు గురైనట్టు అధికారులు మంత్రికి తెలిపారు. వారికి మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యా, వైద్య శాఖ అధికారుల సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. పశ్చిమ…
స్కూళ్ల నిర్వహణ, విద్యార్థుల హాజరు, అమ్మ ఒడి, విద్యాకానుకపై సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్.. సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. కరోనా తర్వాత పాఠశాలల్లో పరిస్థితులపై ఆరా తీసిన ఆయన.. పాఠశాలల్లో కరోనా నివారణ చర్యలను అడిగి తెలుసుకున్నారు.. విద్యాకానుకలో భాగంగా ఇవ్వనున్న స్పోర్ట్స్ డ్రస్, షూలను పరిశీలించి.. వాటికి కొన్ని సూచనలు చేశారు.. ప్రభుత్వం పాఠశాలల్లో హాజరు భారీగా పెరిగిందని, ప్రస్తుతం 91శాతం హాజరు ఉందని ఈ సందర్భంగా సీఎంకు తెలిపారు…
కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఇదే సమయంలో.. జులై 1వ తేదీ నుంచి పాఠశాలలను తిరి ప్రారంభిస్తామని ప్రకటించింది.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కరోనా పరిస్థితిపై సమీక్షించి ఈ నిర్ణయానికి వచ్చారు.. ఇక, రాష్ట్రంలో పాఠశాలల పునః ప్రారంభం, ప్రత్యక్ష తరగతుల పై పాఠశాల విద్యాశాఖ కొన్ని ప్రతిపాదనలు చేసింది.. జులై 1వ తేదీ నుండి 8, 9, 10 తరగతులు ప్రారంభం కానుండగా.. ఉదయం 9.30…
తెలంగాణలో స్కూల్స్ రేషనలైజేషన్ పై విద్యాశాఖలో చర్చ నడుస్తోంది.. అయితే, హేతుబద్దీకరణ చేయాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.. రేషనలైజేషన్ చేస్తే రాష్ట్రంలో 3 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడే అవకాశం ఉందంటున్నారు.. దీనిపై 2015-16లో హేతుబద్దీకరణ పై ప్రభుత్వం ఆలోచించినా.. మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.. అయినా, పాఠశాలల్లో విద్యార్థుల చేరికపై పరిస్థితి మెరుపడలేదు.. రాష్ట్రంలోని 1243 పాఠశాలల్లో జీరో అడ్మిషన్స్ దీనికి నిదర్శనం.. ఒక్క విద్యార్థి కూడా లేని వాటిలో…