ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలకు శీతాకాల సెలవులు ప్రకటించింది. 2024 జనవరి 1 నుంచి 6 వరకు శీతాకాల సెలవులు ఉంటాయని ఢిల్లీ ప్రభుత్వ విద్యా శాఖ బుధవారం తెలిపింది. సాధారణంగా, ప్రాథమిక పాఠశాల పిల్లలకు శీతాకాల సెలవులు డిసెంబర్ 25 నుండి జనవరి 15 వరకు, ప్రాథమిక తరగతులకు శీతాకాల సెలవులు జనవరి 1 నుండి 15 వరకు ఉంటాయి. ఈసారి శీతాకాల సెలవులను 10 నుంచి 15 రోజులు తగ్గించారు.
విద్యాశాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నాడు–నేడు రెండో దశ పనులు నిర్దేశించుకున్న గడువులోగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నాడు-నేడు తొలిదశలో పూర్తైన స్కూళ్ల నిర్వహణను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. వెనుకబడిన వారిపై ప్రత్యేక ధ్యాసపెట్టి, వారు మెరుగ్గా తయారవడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన 'ముఖ్యమంత్రి అల్పాహార పథకం'కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.
స్కూల్ ఫీజు కట్టలేదని నేలపై కూర్చొని పరీక్ష రాయమన్నారు ప్రిన్సిపాల్. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటు చేసుకుంది. తమ కుమారుడికి స్కూల్ ఫీజు బాకీ ఉన్నందున నేలపై కూర్చోబెట్టి పరీక్షలు రాయమని ప్రిన్సిపాల్ ఒత్తిడి చేశారని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు.
ఎండల తీవ్రత తగ్గకపోవటంతో రాష్ట్ర విద్యాశాఖ ఈ నెల 24వరకు ఒంటిపూట బడులు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు మాత్రమే ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధించాలని తెలిపింది.
CM YS Jagan: విద్యా శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. సంబంధిత శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. స్కూళ్లుకు వస్తున్న విద్యార్ధులపై నిరంతరం ట్రాకింగ్ ఉండాలని స్పష్టం చేశారు.. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో క్షేత్రస్ధాయిలో విద్యాశాఖ ఇప్పటికే సినర్జీతో ఉంది.. దీన్ని మరింత సమర్ధవంతంగా వాడుకోవాలి.. పిల్లలు పాఠశాలకు రాని పక్షంలో తల్లిదండ్రులకు మెసేజ్ వెళ్తుందని.. అయినా పిల్లలు బడికి రాని పక్షంలో తల్లిదండ్రులను ఆరా తీస్తున్నారని తెలిపారు. పిల్లలను బడికి…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయులకు శుభవార్త చెప్పింది.. బదిలీలు నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. రెండు రోజుల పాటు వరుసగా సమావేశాలు నిర్వహించిన మంత్రి బొత్స సత్యనారాయణ, చివరికి టీచర్ల బదిలీలు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు.. దీనిపై ఈనెల 12వ తేదీలోపు ప్రకటన విడుదల చేసి, నెల రోజుల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేశారు… ఆన్‌లైన్‌లోనే ప్రక్రియ నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులు, 8ఏళ్లు ఒకేచోట పని చేస్తున్న ఉపాధ్యాయులకు తప్పనిసరి…