Akhilesh Yadav: ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తోందని సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. గతంలో కాంగ్రెస్ కూడా ఇదే విధంగా చేసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ పని అయిపోయిందని, రానున్న కాలంలో బీజేపీకి కూడా ఇదే గతి పడుతుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
PFI wanted Islamic Rule by waging war against govt: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హింసాత్మక మార్గాల ద్వారా ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించి, ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ తన ఛార్జిషీట్ లో పేర్కొంది. ఎన్ఐఏ ఈ కేసులో ఐదో ఛార్జీషీట్ లో 12 మంది పీఎఫ్ఐ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఎన్ఈసీ) సభ్యులు, వ్యవస్థాపక సభ్యులు, సీనియర్ నాయకులతో సహా…
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాను ఈడీ విచారిస్తోంది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సౌత్ గ్రూప్ తో కుమ్మక్కు అయి 5 శాతం నుంచి 12 శాతం మార్జిన్ పెంచినట్లుగా తేలింది. ఆధారాలు దొరక్కుండా అన్ని డిజిటల్ ఫోన్లను ధ్వంసం చేశారు. ఓబెరాయ్ హోటల్ కేంద్రంగా ఇవన్నీ జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. లిక్కర్ కేసుకు సంబంధించి కీలక డిజిటల్ సాక్ష్యాలను మాయం చేశారు. లిక్కర్ స్కాం సమయంలో 14…
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మరో 5 రోజుల కస్టడీని పొడగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో మరో 7 రోజులు సిసోడియాను విచారించేందుకు సమయం కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కోర్టును కోరింది. అయితే కోర్టు మరో 5 రోజుల కస్టడీకి అప్పగించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు వేగవంతం చేసింది. ఈ కేసు సంబంధించిన వ్యక్తులను విచారిస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం మరోసారి ఈడీ ఎదుట హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీసుకు చేరుకోనున్నారు.
lalu Prasad Yadav: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, అతని కుటుంబ సభ్యులపై ఈడీ, సీబీఐ విచారణ జరుపుతోంది. ఆయన కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ చేశారనే అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఈడీ లాలూతో పాటు అతని కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లపై దాడులు చేసింది. ఈ రైడ్స్ లో విస్తూపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో కవితతో పాటు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, శ్రీనివాస్గౌడ్ తో కలిసి శనివారం అర్థరాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు.
Lalu Prasad Yadav: ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వారి కుటుంబ సభ్యులు, సన్నిహితుల ఇళ్లలో వరసగా ఈడీ సోదాలను నిర్వహించింది. తన కుమార్తె, మనవరాలు, కోడలును వేధిస్తున్నారంటూ లాలూ బీజేపీపై మండిపడ్డారు.
Satya Kumar: తెలంగాణాలో 17 పార్లమెంట్ స్థానాలు మాత్రమే ఉన్నాయి.. దేశంలో 543 పార్లమెంట్ స్థానాలు ఉన్న విషయం కేసీఆర్ మరిచిపోయారు అంటూ ఎద్దేవా చేశారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్.. ప్రకాశం జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగరాలని చూసినట్టు ఉంది కేసీఆర్ పరిస్థితి అని ఎద్దేవా చేశారు.. దొంగ దొరికి పోతున్నప్పుడు రకరకాల విన్యాసాలు చేస్తారు.. ఢిల్లీ మద్యం కేసులో టీఆర్ఎస్ నాయకులు కటకటాలు…