ఏపీలో జగన్ ప్రభుత్వం తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. ఏ స్కామ్ లేని సీమెన్స్ ఒప్పందంలో ఏదో జరిగిపోయిందని చెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది.సీమెన్స్ సంస్థ, ప్రేమ్ చంద్రా రెడ్డి, సెంట్రల్ టూల్ డిజైన్స్ సంస్థ తప్పు చేయకుండా చంద్రబాబే తప్పు చేశారా..?ఈడీ ఎంక్వైరీ చేస్తుండగా.. సీఐడీ ఎంక్వైరీ ఎందుకు చేస్తున్నారు.ఈడీ నలుగురిని అరెస్ట్ చేసింది కాబట్టి.. తప్పేననే రీతిలో సీఎం కామెంట్లు చేశారు.అరెస్ట్ చేస్తేనే తప్పు చేసినట్టు అయితే.. ఈ రూల్ సీఎం జగనుకూ వర్తిస్తుంది.అరెస్ట్ అయినంత మాత్రాన తప్పు చేసినట్టు కాదు అనే వాదనే సీఎం జగన్ విషయంలో వైసీపీ చేస్తోంది కదా..?మూడేళ్ల క్రితం సీఐడీ విచారణలో ఏం తేల్చారు..?కేవలం ఓటమి భారం నుంచి తప్పించుకోవడానికే స్కిల్ డెవలప్మెంట్ పై సభలో చర్చించారు.దేశానికి క్విడ్ ప్రొ కో.. షెల్ కంపెనీలు అనే పదాలను పరిచయం చేసింది జగనే అన్నారు పయ్యావుల కేశవ్.
Read Also: Marriage : పెళ్లికెందుకు రాలేదన్నందుకు ‘చావు’ దెబ్బలు కొట్టిన పెళ్లాం
క్విడ్ ప్రో కో.. షెల్ కంపెనీలు అనే పదాలను సీఎం జగన్ మాట్లాడితే ఎలా..?సీఎం జగన్ అనుకున్న విధంగా ఈడీ విచారణలో తేలుతుందనే అనుమానం వైసీపీ ప్రభుత్వానికి వచ్చి ఉంటుంది.అందుకే సమాంతరంగా సీఐడీ విచారణ చేపడుతోంది.రెండు రోజుల పాటు సీమెన్స్ ఒప్పందంలో ఏదో జరిగిపోయిందని సభ సమయాన్ని దుర్వినియోగం చేసింది.ఎక్కడో జీఎస్టీ చెల్లింపులకు సంబంధించి జరుగుతోన్న విచారణకు ఏపీకి.. చంద్రబాబుకు సీఎం జగన్ లింక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ మాజీ ఎండీ అర్జా శ్రీకాంత్ ఇచ్చిన నివేదిక బయట పెట్టండి.ఏ అకౌంట్లకు డబ్బులు వెళ్లాయి.
ఏ పెద్దల ఖాతాలకు వెళ్లాయోననే వివరాలు విడుదల చేయండి.గత ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం ఇచ్చిన నివేదికలేవీ తప్పు పట్టడం లేదు.ఈ ప్రభుత్వం కూడా చాలా మందికి ఉద్యోగాలు ఇప్పించామని స్కిల్ డెవలప్మెంట్ వెబ్ సైట్లల్లో వివరాలు ఉన్నాయి.సీమెన్స్ కంపెనీని విచారణకు పిలవండి.తమకు సంబంధం లేదంటూ సీమెన్స్ సంస్థ ఇచ్చిన స్టేట్మెంటే పట్టుకుని వేలాడుతున్నారు.సీమెన్స్ సంస్థకు డబ్బులు రిలీజ్ చేసింది ఘంటా సుబ్బారావో.. ఇంకొకరో కాదు.. ప్రేమ్ చంద్రారెడ్డి రిలీజ్ చేశారన్నారు కేశవ్.
Read Also: Raviteja: కోర్ట్ బోను ఎక్కిన రవితేజ.. ఏం తప్పు చేశాడు..?