MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 11న ఈడీ ముందు ఆమె హాజరుకాబోతున్నారు. మరోవైపు రేపు జంతర్ మంతర్ వేదికగా మహిళా బిల్లును తీసుకురావాలని డిమాండ్ చేస్తూ..కవిత దీక్ష చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెకు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. రేపు జరగబోయే దీక్షకు 16 పార్టీలకు చెందిన ప్రతినిధులు హాజరుకాబోతున్నారు. 29 రాష్ట్రాల నుంచి మహిళా హక్కుల కోసం పోరాడే సంఘాలు,…
Minister Jagadish Reddy: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)నేత, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ మంత్రులు ఫైర్ అవుతున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి బీజేపీ, ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం మోదీ ప్రభుత్ దుర్మార్గాలకు పరాకాష్ట అని అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కవితపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైను ఈడీ అధికారులు రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో ఈడీ వాదనలు వినిపించింది. అరుణ్ రామచంద్ర పిళ్లైని ఏడు రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ న్యాయస్థానాన్ని కోరింది. పిళ్లై విచారణకు సహకరించడం లేదని ఈడీ న్యాయస్థానానికి తెలిపింది.
Sukesh Chandrashekhar: రూ.200 కోట్ల దోపిడి కేసులో సుకేష్ చంద్రశేఖర్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నాడు. ఈ కేసులో బాలీవుడ్ స్టార్స్ జాక్వలిన్ ఫెర్నాండెస్, నోరా ఫతేహ్ వంటి వారి పేర్లు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే జాక్వలిన్ ఫెర్నాండెస్ కు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ.. సుకేష్ లవ్ లెటర్ రాశాడు. ఈ లెటర్ లో మీడియాను ఆయన మద్దతుదారులను, వ్యతిరేకులను ఉద్దేశిస్తూ హోలీ విషెస్ తెలిపారు.
Skill Development Scam: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కీలక మలుపు తిరుగుతోంది.. పెద్దస్థాయి అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తోంది.. అప్పట్లో స్కిల్‌డెవలప్‌మెంట్ అధికారిగా పనిచేసిన అర్జా శ్రీకాంత్‌పై విచారణకు సిద్ధం అవుతున్నారు సీఐడీ అధికారులు.. నోటీసులు జారీచేసేదిశగా సీఐడీ అధికారులు సిద్ధం అవుతున్నారు.. ఈ కేసులో మరింత మంది కీలక వ్యక్తులను అరెస్ట్ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు.. తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్న స్కిల్‌డెవలప్‌మెంట్ కేసు.. గతంలో చంద్రబాబు హయాంలో నైపుణ్యాభివృద్ధిపేరిట ప్రాజెక్టు చేపట్టారు.. సీమెన్స్‌తో కలిసి శిక్షణ…
Opposition letter to Modi:కేంద్ర సంస్థల దుర్వినయోగంపై 9 మంది ప్రతిపక్ష నేతలు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. తమ నేతలను ఇరికించేందుకు కేంద్ర ఏజెన్సీలను దుర్వినయోగం చేస్తున్నారని ఆరోపిస్తున్నారని ప్రతిపక్ష నేతలు లేఖలో ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఇరికించడాన్ని ఆప్ నేతలు ఉదహరించారు. ఇలాగే మరికొన్ని ఉదాహరణలను లేఖలో పేర్కొన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి)లను నేతలను ఇరికించేందుకు వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.
Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ లో ఈడీ చార్జీషీట్ లో కీలక వ్యక్తుల పేర్లను చేర్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును కూడా చేర్చింది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మరో 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు నమోదు చేసింది.
Over Rs 10 crore in cash seized from TMC MLA Jakir Hossain's properties: పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) ఎమ్మెల్యే ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. ఏకంగా రూ. 10 కోట్ల నగదును ఆదాయపు పన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కోల్‌కతా, ముర్షిదాబాద్ ప్రాంతాల్లో టీఎంసీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జాకీర్ హుస్సెన్ ఇళ్లలో సోదాలు నిర్వహించింది ఐటీ శాఖ. బుధవారం, గురువారాల్లో మొత్తం 28 ప్రాంతాల్లో ఐటీ…
మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈరోజు న్యూఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టుకు వచ్చారు. సుకేష్ చంద్రశేఖర్, ఇతరులకు సంబంధించిన 200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఒకరు.