ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తున్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో నిందితుడు ఆప్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు బుధవారం ఏప్రిల్ 17 వరకు పొడిగించింది ఏప్రిల్ 12న అతని బెయిల్ పిటిషన్‌ను విచారించనుంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేసిందని, రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు, భయపెట్టేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటోందని ఆరోపిస్తూ 14 ప్రతిపక్ష పార్టీలు వేసిన పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
Bank Loan Fraud: సాధారణంగా సామన్యుడైన రైతుకు లోన్ పెంచాలంటే సవాలక్ష ప్రశ్నలు వేసే బ్యాంకు అధికారులు, కొంత మంది దొంగల మాటల వలలో పడి కోట్లకు కోట్లు అప్పులు ఇస్తుంటారు. ఇలాంటి ఘటనలు ఇండియాలో చాలానే జరిగాయి. తాజాగా తప్పుడు పత్రాలు సమర్పించి ఓ వ్యాపారవేత్త స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.95 కోట్లు టోకరా పెట్టాడు. చివరకు అతడిని అధికారులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే కోల్‌కతాకు చెందిన వ్యాపారవేత్త ఎస్ బీ ఐ…
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణను రోస్ అవెన్యూ కోర్టు ఏప్రిల్ 5న వాయిదా వేసింది.
Jacqueline Fernandez: రెలిగేర్ మాజీ ప్రమోటర్ మల్వీందర్ సింగ్ భార్యను మోసం చేసిన మనీలాండరింగ్ కేసులో సుకేష్ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుఖేష్ చంద్రశేఖర్ ను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం అతడు ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్నారు. ఇదిలా ఉంటే ఆయన పుట్టిన రోజు సందర్భంగా బాలీవడ్ యాక్టర్, సుకేష్ ప్రేయసి జాక్వలిన్ ఫెర్నాండేస్ కు లవ్ లెటర్ రాశాడు. ఆమెపై తనకున్న ప్రేమను ప్రేమలేఖలో వ్యక్త పరిచాడు.
Supreme Court: రాహుల్ గాంధీకి పరువునష్టం కేసులో రెండు ఏళ్ల జైలు శిక్ష విధించిన తర్వాత రాజకీయం మారుతోంది. తాజాగా శుక్రవారం 14 ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తుందని ఆరోపిస్తూ అత్యున్నత న్యాయస్థానం తలుపుతట్టారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), ఐటీ వంటి సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్ర కు కల్వకుంట్ల కవిత సంచలన లేఖ రాశారు. ఫోన్ల ధ్వంసం ఆరోపణ చేయడాన్ని కల్వకుంట్ల కవిత తీవ్రంగా తప్పుపట్టారు. దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా నేను గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నానని ఆమె పేర్కొన్నారు.