పశ్చిమబెంగాల్‌లో జరిగిన టీచర్స్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన కేసులో జూలై 9 తర్వాత ఈడీ విచారణకు హాజరవుతానని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసుకు సంబంధించి కీలకమైన వ్యక్తి, సౌత్ గ్రూప్ లో ముఖ్య సభ్యుడు శరత్ చంద్రారెడ్డి అఫ్రూవర్ గా మారుతున్నట్లు తెలిపాడు. దీంతో ఆయన రౌస్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టును ఇటీవల ఆశ్రయించారు. అప్రూవర్ గా మారుతున్నందుకు అనుమతివ్వాలంటూ కోరాడు.
ED: గుంటూరు జిల్లా మంగళగిరిలోని NRI మెడికల్ కాలేజీ ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, మణి అక్కినేని ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది. 307 కోట్ల రూపాలయ విలువైన ఆస్తులు అటాచ్ చేశారు. 15 కోట్ల రూపాయల బ్యాంకు లావాదేవీలతోపాటు భూములు, భవనాలు అటాచ్ చేసింది ఈడీ. అయితే, కరోనా సమయంలో సొసైటీ పేరుతో వసూలైన డబ్బులను దారి మళ్లించినట్టు NRI మెడికల్ కాలేజీ యాజమాన్యంపై ఆరోపణలు ఉన్నాయి. అధిక…
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఒకేరోజులో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్కామ్‌లోని ప్రధాన నిందితుల్లో ఒకరైన శరత్ చంద్రారెడ్డికి భారీ ఊరట లభించింది. రౌస్ ఎవెన్యూ కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. శరత్ చంద్రారెడ్డి భార్య కనికారెడ్డి అనారోగ్య పరిస్థితి దృష్ట్యా.. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. ఇప్పుడు దాన్ని పూర్తిస్థాయి బెయిల్‌గా మార్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ…
Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా కొనసాగుతోంది. ఈ కేసు విచారణ కీలక మలుపు తిరుగుతుంది. ఈడీ విచారణలో ట్విస్ట్‌లు వెలువడుతున్నాయి. తాజాగా ఈ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది.
టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్ కుమార్,రాజశేఖర్ రెడ్డిలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారుల బృందం రెండోరోజు చంచల్‌గూడ సెంట్రల్ జైలులో ప్రశ్నించనుంది.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను సీబీఐ సమాన్లు సంచలనంగా మారింది. ఈ కేసును సీబీఐ, ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతోపాటు చాలా మంది అరెస్ట్ అయ్యారు.
రైల్వేలో ఉద్యోగాల కోసం భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడుగా వ్యవహరిస్తోంది. మనీలాండరింగ్ కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కుమార్తె చందా యాదవ్ వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు గురువారం నమోదు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేపర్ లీక్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి తమ వాంగ్మూలాలను నమోదు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.