Kalki2898AD : కల్కి 2 షూటింగ్ స్టార్ట్.. ప్రభాస్ కోసం వెయిటింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో.. ఈ సినిమా సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు సినీ ప్రియులు. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఫస్ట్ షెడ్యూల్‌లో ఇద్దరు దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాల్గొంటున్నారు. కల్కి మొదటి భాగంలో అమితాబ్ బచ్చన్ ‘అశ్వత్థామ’గా తన విశ్వరూపాన్ని చూపించగా, కమల్ హాసన్ ‘సుప్రీమ్ యాస్కిన్’గా సరికొత్త కనిపించారు. ఈ రెండు పాత్రలు ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచాయి.
Also Read : Varanasi : మహేశ్ – రాజమౌళి ఫైట్.. రేయ్ దారుణం రా ఇది?
Also Read
- WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
ఇప్పుడు వీరిద్దరూ సెట్స్‌లో సందడి చేసిన ఫోటోలు బయటికి వచ్చాయి. కమల్ హాసన్‌ను మళ్ళీ కలుసుకోవడం సంతోషంగా ఉంది.. అని అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్‌లో రాస్తూ.. షూటింగ్ సెట్ నుండి కొన్ని ఫోటోలను పంచుకున్నారు. దీంతో.. ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అశ్వత్థామ, యాస్కిన్ మధ్య జరిగే పోరాట సన్నివేశాలు ఈ సీక్వెల్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చిత్ర యూనిట్ వర్గాల సమాచారం. ఇక ఈ సీక్వెల్‌లో ప్రభాస్ ఎప్పుడు షూటింగ్‌లో పాల్గొంటారనే దానిపై కూడా స్పష్టత వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో కేవలం అమితాబ్, కమల్ హాసన్‌ల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్ తన ఇతర ప్రాజెక్టుల పని ముగించుకుని, తదుపరి షెడ్యూల్‌లో కల్కి 2 సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నాడు. వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సీక్వెల్, మొదటి భాగం కంటే రెట్టింపు విజువల్ ఎఫెక్ట్స్ , యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఉండబోతోంది. మరి కల్కి 2 ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘ఎపిక్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!