పూటకో మాట కోమటిరెడ్డి బ్రదర్స్ నైజం అని మంత్రి జగరదీశ్ రెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. రాజ్ గోపాల్ రెడ్డి అమ్ముడుపోయిన వ్యవహారంను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నామని అన్నారు. 20వేల కోట్ల కాంట్రాక్టులు తీసుకున్నట్టు రాజ్ గోపాల్ రెడ్డి ఒప్పుకున్నారని గుర్తు చేశారు జగదీశ్ రెడ్డి.
త్వరలోనే నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరగనున్నాయి.. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఇప్పటి వరకు తమ అభ్యర్థిని ప్రకటించకపోయినా.. అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం విస్తృతంగా పర్యటనలు సాగిస్తూనే ఉన్నారు.. అయితే, ఇప్పుడు ఉప ఎన్నికలో అధికార పార్టీ.. భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో బరిలోకి దిగుతుందా? లేక టీఆర్ఎస్ పార్టీ పేరుతోనే పోటీ చేస్తుందా? అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.. ఎందుకంటే.. నిన్నటి నిన్ననే టీఆర్ఎస్ను…
గురువారం రోజు నామినేషన్ల పరిశీలన పూర్తి చేసిన ఎన్నికల సంఘం అధికారులు.. ప్రమాణాలకు అనుగుణంగా లేని నామినేషన్లను తిరస్కరించారు.. రాష్ట్రపతి ఎన్నికల ప్రధానంగా బరిలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ పత్రాలకు ఓకే చెప్పారు..
రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియాతో సమావేశమై, షెడ్యూల్ను ప్రకటించనుంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం వచ్చే నెల జులై 24తో ముగియనుంది. 2017, జులై 25న రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి వ్యక్తి రామ్నాథ్ కోవిందే. Gujarat: మృత్యుంజయుడు.. బోరుబావిలో పడిపోయిన బాలుడిని రక్షించిన ఆర్మీ రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఇందులో పార్లమెంట్…
కర్నూలు జిల్లాలో 2019 ఎన్నికల నిధుల్లో గోల్ మాల్ జరిగిందా? అడ్డగోలుగా ఖర్చు చేసి బిల్లులు సమర్పించడంలో నిబంధనలకు నీళ్లొదిలారా? ఆడిట్ లో అక్రమాలు బయటపడుతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్లో అక్రమాలు, నిబంధనలు అతిక్రమించడం ఆడిట్ లో వెలుగు చూస్తున్నాయి. అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ నుంచి ముగ్గురు సీనియర్ ఆడిటర్లు కర్నూలు కలెక్టరేట్ ఎన్నికల విభాగంలో రెండు రోజులుగా ఆడిటింగ్ కొనసాగిస్తున్నారు. ఎన్నికల నిధుల్లో ఖర్చు…
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దేశంలోని అన్నిరంగాలు తిరిగి తెరుచుకోవడంతో ఎన్నికల కమిషన్ ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు, కరోనా కేసులు, బందోబస్తు తదితర విషయాలపై ఈరోజు మరోసారి రివ్యూ చేసింది. కరోనా కేసుల కారణంగా మొన్నటి వరకు పాదయాత్రలు, ర్యాలీలకు అనుమతులు ఇవ్వలేదు. తాజా రివ్యూ అనంతరం ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. పాదయాత్రలు, ర్యాలీలకు అనుమతులు మంజూరు చేసింది. అయితే, ర్యాలీలు, పాదయాత్రలకు జిల్లా అధికారుల పర్మీషన్ తప్పనిసరి చేసింది. అంతేకాదు,…
ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది. కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్నది. నేర చరిత్ర కలిగిన అభ్యర్థులకు టికెట్ ఇవ్వాలి అంటే ఎందుకు ఇవ్వాలి అనే దానిపై రాజకీయ పార్టీలు క్లారిటీ ఇవ్వాలని సీఈసీ తెలియజేసింది. కరోనా కారణంగా ఎన్నికల సమయాన్ని గంట పెంచుతున్నట్టు తెలియజేసింది. కరోనా పాజిటివ్గా నిర్ధారణ జరిగిన ఓటర్లు పోస్టల్ బ్యాలెట్…