5 States Elections: 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. 2024 లోక్ సభ ఎన్నికల ముందు జరుగుతున్న ఎన్నికలు కావడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వానేనా అనే రీతిలో పోరాడుతున్నాయి. దీంతో మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హీటెక్కింది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కొన్నిసార్లు ఈ విమర్శలు వివాదాస్పదం అవుతున్నాయి.
తెలంగాణలో బదిలీ చేసిన స్థానాల్లో అధికారులను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్పీలు, సీపీలు, కలెక్టర్లను నియమిస్తూ లిస్ట్ పంపింది. అందులో హైదరాబాద్ సీపీగా సందీప్ శాండిల్యాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక.. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శిగా సునీల్ శర్మ, ఎక్సైజ్ కమిషనర్‌గా జ్యోతి బుద్ధ ప్రకాశ్, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌గా క్రిస్టినా పేర్లను ప్రకటించింది.
Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని భావించిన కేంద్ర ఎన్నికల సంఘం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది.
ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నిక చెల్లదని హైకోర్టు ప్రకటించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేయాలని కోరారు. ప్రస్తుతం ఈ కేసులో పిటిషనర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గద్వాలలో ఎన్నికల బరిలోకి దిగారు. కానీ, ఆమె బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారంటూ కృష్ణమోహన్‌రెడ్డి ఆరోపించారు.
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని వైసీపీ నేతలు కలిశారు. ఏపీలో ఎన్నికల ఓటర్ లిస్టులో డూప్లికేట్ ఓటర్లు ఇంకా ఉన్నారు అని ఈ సందర్భంగా మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఒకే పేరు.. ఒకే ఐడీ.. ఒకే ఫొటోతో వేర్వేరు చోట్ల ఓట్లు ఉన్నాయి.. దీన్ని సరి చేయాలని ఎన్నికల అధికారిని కోరామని ఆయన పేర్కొన్నారు.
బీఆర్కే భవన్ లో సీఈఓ వికాస్ రాజ్ తో బీఆర్ఎస్ నేతలు సమావేశం అయ్యారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ లీగల్ సెల్ నేతలు సోమభరత్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, పలువురు అడ్వకేట్స్ ఫిర్యాదు చేశారు.
Sachin Tendulkar recognised as National Icon of EC: భారత ఎన్నికల సంఘం (ఈసీ) నేషనల్ ఐకాన్‌గా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బుధవారం నియమితులయ్యారు. ముఖ్యంగా పట్టణ మరియు యువత ఓటింగ్ పెంచేందుకు ప్రచారకర్తగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. నేడు ఢిల్లీలో సచిన్, ఎన్నికల ప్యానెల్ మధ్య ఎంఓయూ కుదిరింది. మూడేళ్ల ఒప్పందంలో భాగంగా రానున్న ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా క్రికెట్ దిగ్గజం సచిన్ పని చేయనున్నారు. నియామకం అనంతరం సచిన్…
క్రికెట్ లెజెండ్, భారతరత్న సచిన్ టెండూల్కర్ తో ఎన్నికల సంఘం ఒప్పందం కుదుర్చుకోనున్నది. ఎన్నికలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సచిన్‌ను నేషనల్ ఐకాన్‌గా ఈసీ నియమించనున్నది.
Karnataka Polls: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోనియా గాంధీ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.. సోనియా గాంధీ చేసిన ట్వీట్ ఈ దుమారానికా కారణం అవుతుంది. కర్ణాటక ప్రతిష్ఠకు, సార్వభౌమత్వానికి, సమగ్రతకు ముప్పు వాటిల్లేలా.. తమ పార్టీ ఎవరినీ అనుమతించదంటూ సోనియా గాంధీ పేరుతో ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ కామెంట్లను ఖండించారు. వేర్పాటువాదంపై ఆ పార్టీ బహిరంగ ప్రకటనలు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌తోపాటు సోనియాపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ..…
జగిత్యాల జిల్లా నేడు ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి మిస్సింగ్ పై కేంద్ర ఎన్నికల సంఘం అధికారి విచారించనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈసీ అధికారులు విచారణ చేపట్టనున్నారు.