శీతాకాలం మొదలైంది. చలికాలంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చలికాలం అనేక సీజనల్ వ్యాధులను తెస్తుంది. శీతాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ.. అనేక ఇతర సీజనల్ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఈ క్రమంలో మనం తీసుకునే ఆహారం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. కాలానుగుణ వ్యాధులను నివారించడానికి.. బలమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఇది మన శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చలికాలంలో ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే సీజనల్ వ్యాధులు దరి చేరవు.
చలికాలంలో వ్యాధులు రాకుండా ఉండాలంటే.. సీజనల్ పండ్లు, కూరగాయలు తినడం చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా.. కొన్ని పప్పులు, గింజలను తినడం వల్ల సీజనల్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వాటిలో విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చలికాలంలో మన రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతాయి.
Health Tips: రోజూ ఉదయాన్నే ఈ నీటిని తాగితే బెల్లీ ఫ్యాట్ మటుమాయం..!
బాదం పప్పు:
బాదంపప్పు తింటే ఆరోగ్యానికి ఎల్లప్పుడూ మేలు చేస్తుంది. బాదం అత్యంత ప్రజాదరణ పొందింది. దీనిని ఎక్కువగా వినియోగిస్తారు. ఇందులో జింక్ ఉంటుంది.. ఇది శరీర కణజాలాలను సరిచేయడంలో, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బాదంలో విటమిన్ ‘ఇ’ కూడా ఉంటుంది. ఇది వాపును తగ్గిస్తుంది.
వేరుశెనగ:
చలికాలంలో వేరుశెనగలను ఎక్కువగా తింటారు. వేరుశెనగలు రోగనిరోధక శక్తిని, కణాల పునరుత్పత్తిని పెంచడంలో సహాయపడతాయి. శీతాకాలంలో వేరుశెనగను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధుల నుండి మనల్ని రక్షించడంలో మేలు జరుగుతుంది.
గుమ్మడికాయ గింజలు:
గుమ్మడికాయ గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుమ్మడికాయ గింజలలో ఆరోగ్యకరమైన ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తికి ముఖ్యమైనవి.
అవిసె గింజలు:
చలికాలంలో వ్యాధులు రాకుండా ఉండేందుకు అవిసె గింజలను తీనడం మంచిది. అవిసె గింజల్లో కూడా ఒమేగా-3, కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.