Atrocious: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండేపూడిలో వివాహితకు భర్త శిరోమండనం చేసిన అమానుష ఘటన చోటుచేసుకుంది. అనుమానంతో భార్యను చిత్ర హింసలు ఆమెకు గుండు గీసి పరారయ్యాడు. నాలుగేళ్ల క్రితం హైదరాబాదులో సినిమా జూనియర్ ఆర్టిస్టులుగా పనిచేసిన కర్రి అభిరామ్, ఆశలు అప్పట్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. స్థానిక పెద్ద మనుషుల వద్ద కూడా విభేదాలు సర్దుబాటు కాలేదు. భార్యను గదిలో బంధించి చిత్రహింసలు పెట్టి ఆమెకు గుండు గీసి జుట్టును తీసుకుని వెళ్ళిపోయాడు.
Read Also: Cricket Tournament: పంచె కట్టుకొని క్రికెట్ ఆడిన పూజారులు.. కాలక్షేపానికి కాదండోయ్..!
అనంతరం భార్య జుట్టును చేత్తో పట్టుకుని చూపుతూ ఊరంతా హల్‌చల్ చేశాడు శిరోముండనం చేసిన భార్యను ఊరంతా తిప్పి అమానవీయంగా ప్రవర్తించాడు. తన భర్తకు రెండో పెళ్లి చేసేందుకు అత్తమామలు సిద్ధమయ్యారని బాధితురాలు వెల్లడించారు. పుట్టింటికి వచ్చిన తనపై భర్త దాడి చేశాడని వాపోయారు. బాధితురాలని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పోలీసులు భర్త అభిరామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు సెల్ఫీ వీడియో ద్వారా ఆశ తన భర్త పెట్టిన బాధలను వివరించింది.