Andhra Pradesh Crime: ఇన్సూరెన్స్ డబ్బు కోసం స్కెచ్.. చనిపోయినట్లు నాటకం.. చివరి ఏమైందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh Crime: చనిపోయాడు అనుకున్న ఓ వ్యక్తి బతికే ఉన్నానని.. అప్పులు పాలైన ఓ రైతు సినిమా ఫక్కీలో భీమా సొమ్ము కోసం ఆడిన డ్రామా కేసు వెలుగు చూసింది.. ఈ కేసును చేధించిన పోలీసులకు దిమ్మ తిరిగే విషయాలు చూసి షాక్ తిన్నారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. వాటిని తీర్చడానికి తాను చనిపోయినట్లు ఓ సినిమా తీసేంత స్థాయిలో భారీ స్కెచ్ వేశాడు. బీమా సొమ్ము కోసం చనిపోయి నట్లు నమ్మించాలని అనుకున్నాడు. పథకం బెడిసికొట్టి పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు..
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 26న గుర్తుతెలియని వ్యక్తి మృతి కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. కేతమళ్ల వెంకటేశ్వరరావు అలియాస్ పూసయ్య అనే వ్యక్తి.. వీరంపాలెంలో ధాన్యం వ్యాపారి. వివిధ అవసరాల కోసం ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేశాడు.. అవి తీర్చలేని పరిస్థితి వచ్చింది.. దీంతో, వాటి నుంచి బయటపడేందుకు తానే చనిపోయినట్టు చిత్రీకరించి.. కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళితే తన పేరిట రూ.40లక్షల బీమా సొమ్ము వస్తుందని ఆశించారు.. దాని కోసం ప్రమాదవశాత్తు మరణించినట్టు అందరినీ నమ్మించడానికి ప్లాన్ చేశాడు.. అతడి స్థానంలో వేరే మృతదేహాన్ని ఉంచి ఎవరూ గుర్తించకుండా చేయాలని భావించాడు. ఇక, ఆ డెడ్‌బాడీ కోసం మోరంపూడికి చెందిన ఇద్దరు యువకులతో డీల్ చేసుకున్నాడు..
Also Read
- TGTET Results 2026: తెలంగాణ ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!
- Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
- Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
- DGP CV Anand: గణేశ్ నిమజ్జనాల్లో తీవ్ర విషాదాలు.. తెలంగాణలో ఎస్సై సహా 13 మంది మృతి..
అయితే, పాత బొమ్మూరులో ఈ నెల 23వ తేదీన ఓ వ్యక్తి చనిపోయాడు.. మరుసటిరోజు బంధువులు స్థానిక శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించి.. మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఈ విషయాన్ని విషయం తెలుసుకున్న ఇద్దరు యువకులు.. పూడ్చిపెట్టిన ఆ మృతదేహాన్ని 25వ తేదీన దొంగిలించారు. వీరయ్య చెప్పిన ప్లాన్ ప్రకారం.. ఆ మృతదేహాన్ని వీరంపాలెం తీసుకెళ్లి పొలంలోని ట్రాన్స్ ఫార్మర్ వద్ద పెట్రోలు పోసి నిప్పుపెట్టారు.. ఆ ప్లేస్‌లో పూసయ్య చెప్పులతో పాటు సెల్ఫీని అక్కడే ఉద్దేశ్యపూర్వకంగా వదిలివెళ్లారు. ఇక, ఆధారాలనుబట్టి మృతదేహం పూసయ్యదే నని గ్రామస్థులు భావించి పోస్టుమార్టం కోసం తరలించారు. భర్త మరణించారని భావించి ఆయన భార్య తట్టుకోలేక తానూ చనిపోతానంటూ కన్నీరుమున్నీరైంది.. ఇక్కడ జరిగే విషయాలను ఎప్పటికప్పుడు ఆ ఇద్దరు యువకులు.. అజ్ఞాతంలో ఉన్న పూసయ్యకు వివరిస్తూ వచ్చారు..
ఇక, భార్య బాధను చూడలేక ఆమెకు.. ఎలాగైనా అసలు విషయాన్ని చెప్పాలని భావించి పూసయ్య.. మరో కొత్త స్కెచ్ వేశాడు.. గుర్తుతెలియని యువకులు ఎవరో పొలంలో ఓ మృతదేహాన్ని కాలుస్తుండగా తాను అడ్డుకున్నానని, దీంతో వారు తనను కొట్టి ఆటోలో తీసుకెళ్లారని.. ఆ తర్వాత తుప్పల్లో పడేసి వెళ్లారని చెప్పుకొచ్చాడు.. కానీ, అతడి శరీరంపై గాయాలు లేకపోవడం అనుమానాలకు తావిచ్చింది. ఈ ఘటనలో అప్పడికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. పూసయ్య మళ్లీ రావడంతో.. తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపెట్టాడు. పూసయ్యతో పాటు అతడికి సహకరించిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
తాజావార్తలు
-
Chiranjeevi: చిరూ లీక్స్ మెగా జోష్.. కాకా షూటింగ్ గురించి మాస్ లీక్ ఇచ్చిన మెగాస్టార్!
-
TGTET Results 2026: తెలంగాణ ఇన్-సర్వీస్ ఫలితాలు విడుదల.. 70 శాతం దాటిన ఉత్తీర్ణత..!
-
Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
-
TRAI Internet TV Rules: TRAI కొత్త రూల్స్.. ఇంటర్నెట్లో ఫ్రీగా టీవీ ఛానెళ్లను చూడటం ఇక కష్టమేనా?
-
Nursing Home Seized: వారం రోజుల్లో ఇద్దరు మృతి.. తిరువూరు నర్సింగ్ హోమ్ సీజ్..!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?